lifestyle

వేగంగా ఈత నేర్చుకోవడం ఎలా ? దీని వెనుక ఉన్న సైన్స్‌ గురించి తెలుసుకోండి..!

ఈత నేర్చుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ కొందరే ధైర్యంగా ఈత నేర్చుకుంటారు. చాలా మంది ఈత అంటే భయపడతారు. అలాంటి వారు స్విమ్మింగ్‌ పూల్స్‌లో ముందుగా ఈత కొట్టడం ప్రాక్టీస్‌ చేస్తారు. తరువాత నెమ్మదిగా ఈత నేర్చుకుంటారు. అయితే ఈత వెనుక ఉన్న సైన్స్‌ గురించి తెలుసుకుంటే ఈత కొట్టడాన్ని ఎవరైనా సులభంగా నేర్చుకోవచ్చు. మరి ఆ సైన్స్‌ ఏమిటంటే…

how to learn swimming quickly

నీటి కన్నా మనిషి శరీరం సాంద్రత కొంచెం తక్కువ. అందువల్ల నీళ్లను మింగకుండా ఉంటే నీటిలో మన శరీరం తేలుతుంది. ఇది సైన్స్‌ చెబుతున్నమాట. అందుకనే చాలా మంది తమ నోరు, ముక్కును నీటి ఉపరితలం కన్నా పైన ఉంచి ఈత కొడుతారు. ఇదే అసలు ట్రిక్‌. నీటి స్థాయి కన్నా పైభాగంలో నోరు, ముక్కు ఉండాలి. దీంతో శరీరం నీటిలో తేలుతుంది. కానీ నీటిని మింగరాదు. అలాగే భయపడరాదు. భయం వల్ల ఈత కొట్టే సమయంలో చాలా మంది నీళ్లు తాగుతారు. దీంతో నీటిలో మునిగిపోతారు. కానీ భయపడకుండా నీటిలో శరీరాన్ని బ్యాలెన్స్‌ చేసే ప్రయత్నం చేయాలి. అందుకు ముందుగా ముక్కు, నోరును ఎప్పుడూ పైకి ఉంచాలి.

చిత్రంలో ఇచ్చిన విధంగా నీటిలో 30 నుంచి 60 డిగ్రీల మధ్యలో ఒక కోణం ఏర్పడేలా ఉండి ఈత కొట్టాలి. ఆ సమయంలోనూ నోరు, ముక్కులను నీటికి పై భాగంలో ఉండేలా చూసుకోవాలి. తరువాత వెనుక వైపు కాళ్లను ఆడించాలి. ముందు వైపు చేతుల్తో నీళ్లను వెనక్కి నెట్టాలి. ఇది శరీరాన్ని బ్యాలెన్స్‌ చేస్తుంది. దీంతో నీటిలో తేలుతారు. అయితే ఇలా చేయాలంటే శరీరం మొత్తం కదలాల్సి ఉంటుంది. కనుక మొదటిసారి ఈత కొట్టే వారికి బాగా శ్రమ అనిపించినట్లు అవుతుంది. కానీ నిరంతరం సాధన చేస్తే తేలికవుతుంది. జంతువులు కూడా నోరు, ముక్కులను నీటికి పై భాగంలో ఉండేలా ఉంచి ఈత కొడతాయి. గమనించవచ్చు. ఈ సూత్రాన్ని గుర్తుంచుకుంటూ శరీరాన్ని నీటిలో బ్యాలెన్స్‌ చేయగలిగితే చాలు. ఈత కొట్టడాన్ని వేగంగా నేర్చుకుంటారు. అదేమీ బ్రహ్మ విద్య కాదు.

Admin

Recent Posts