Green Tea : గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా శరీరంలోని కొవ్వును కరిగించేందుకు గ్రీన్ టీ ఎంతగానో దోహదపడుతుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. అయితే గ్రీన్ టీని అతిగా తాగితే అనర్థాలే కలుగుతాయి. రోజుకు 3 కప్పులకు మించి గ్రీన్ టీని సేవిస్తే ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీని ఎక్కువగా తాగడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అతిగా గ్రీన్ టీని తాగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. జీర్ణాశయంలో అసౌకర్యం కలుగుతుంది. గ్యాస్, అసిడిటీ వస్తాయి. కడుపులో మంట కూడా వస్తుంది.
2. గ్రీన్ టీలో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. మోతాదులో తాగితే గ్రీన్ టీ వల్ల తలనొప్పి తగ్గుతుంది. కానీ అతిగా తాగితే తలనొప్పి పెరుగుతుంది. అందువల్ల గ్రీన్ టీని ఎక్కువగా తాగరాదు.
3. గ్రీన్ టీని అతిగా తాగడం వల్ల రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. శరీరంలో రక్తం పరిమాణం తగ్గుతుంది.
4. గ్రీన్ టీని బాగా తాగితే తలతిరగడం, వికారం వంటి సమస్యలు వస్తాయి. లివర్ పై చెడు ప్రభావం పడుతుంది. కనుక గ్రీన్ టీని తగిన మోతాదులోనే తాగాల్సి ఉంటుంది.