Guava In Summer : వేస‌విలో జామ‌కాయ‌ల‌ను తిన‌డం మ‌రిచిపోకండి..!

Guava In Summer : సీజన్లు మారేకొద్దీ స‌హ‌జంగానే మ‌న‌కు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ముఖ్యంగా ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం ఇబ్బందుల‌కు గురిచేస్తుంటాయి. అయితే వేసవి సీజన్‌లో వీటితోపాటు ప‌లు ఇత‌ర అనారోగ్యాలు కూడా వ‌స్తుంటాయి. విరేచనాలు, అజీర్ణం వంటి జీర్ణ స‌మ‌స్య‌లు వేస‌విలో ఎక్కువ‌గా వ‌స్తాయి. కానీ జామ‌కాయ‌ల‌ను తింటే వీటికి చెక్ పెట్ట‌వ‌చ్చు. అందువ‌ల్ల వేస‌విలో జామ‌కాయ‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా తినాల్సి ఉంటుంది.

Guava In Summer you should definitely eat this in this season
Guava In Summer

జామ‌కాయ‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. అజీర్ణం, గ్యాస్, మ‌ల‌బ‌ద్ద‌కం, విరేచ‌నాలు వంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. పైగా వేస‌విలో బ‌రువు త‌గ్గేందుకు జామ‌కాయ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచ‌డంలోనూ జామ‌కాయ‌లు ప‌నిచేస్తాయి. క‌నుక జామ‌కాయ‌ల‌ను ఈ సీజ‌న్‌లో క‌చ్చితంగా తినాల్సిందే.

జామ‌కాయ‌ల్లో ఉండే విట‌మిన్ సి ద‌గ్గు, జ‌లుబు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. క‌నుక సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

జామ‌పండ్ల‌ను జ్యూస్‌లా త‌యారు చేసి రోజూ మ‌ధ్యాహ్నం తాగితే ఎంతో లాభం క‌లుగుతుంది. శ‌రీరం చ‌ల్ల‌గా మార‌డ‌మే కాకుండా వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఎండ దెబ్బకు గురికాకుండా ఉంటారు.

ఈ సీజ‌న్‌లో జీర్ణ‌క్రియ మ‌న‌కు మంద‌గిస్తుంది. కానీ జామ‌కాయ‌ల‌ను తింటే జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. వేస‌విలో మాంసాహారం తింటే చాలా మందికి క‌డుపులో అసౌక‌ర్యం క‌లుగుతుంది. దాన్ని నివారించేందుకు జామ‌కాయ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇలా ఈ సీజ‌న్‌లో జామ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts