Guava Leaves : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో జామ పండు కూడా ఒకటి. జామపండును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మనకు దాదాపుగా అన్ని కాలాల్లో ఈ జామపండు విరివిరిగా లభిస్తుంది. జామ పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చన్న సంగతి మనకు తెలిసిందే. జామకాయలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో జామచెట్టు ఆకులు కూడా మన ఆరోగ్యానికి అంతే మేలు చేస్తాయి. జామ ఆకులను ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చన్న సంగతి మనలో చాలా మందికి తెలియదు. జామ ఆకుల్లో కూడా అనేక రకాల పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
జామ ఆకులను ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. జామ ఆకులను ఉపయోగించడం వల్ల మనం జలుబు, దగ్గు, నోటిపూత, పంటి నొప్పి, నోటిపూత వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. జామ ఆకుల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ప్లవనాయిడ్స్, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. జామ ఆకుల రసం తాగినా లేదా వాటితో టీ ని తయారు చేసుకుని తాగినా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఆహారం తీసుకున్న తరువాత జామ ఆకుల టీని తాగడం వల్ల చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంటాయి. జామ ఆకులతో మనం టీ ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.
ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. ఇందులోనే 4 జామ ఆకులను శుభ్రంగా కడిగి వేయాలి. ఈ నీటిని అర గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించి వడకట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల జామ ఆకుల టీ తయారవుతుంది. ఈ టీ గోరు వెచ్చగా అయిన తరువాత తాగడం వల్ల మనం చక్కటి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు. ఇలా జామ ఆకులతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తంలో ఉండే మలినాలు తొలగిపోయి రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.అజీర్తి, మలబద్దకం సమస్య తగ్గుతుంది.
అజీర్తి కారణంగా వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నప్పుడు జామ ఆకులతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జామ ఆకుల టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఈ టీని తాగడం వల్ల స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. జామ ఆకుల టీ ని తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ టీ ని తాగడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. ఈ టీ ని తాగడం వల్ల క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉంటాయి. జామ ఆకుల టీ ని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల నోటిపూత తగ్గుతుంది.
దంతాలు, చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి. నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధిక బరువుతో బాధపడే వారు జామ ఆకుల టీ ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కేవలం ఆరోగ్యానికి కాదు చర్మానికి కూడా జామ ఆకులు మేలు చేస్తాయి. జామ ఆకుల పేస్ట్ ను స్క్రబర్ లా వాడడం వల్ల సమస్యలు తగ్గి చర్మం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ఈ విధంగా జామ ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను మన దరి చేరకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.