Hair Growth Tips : వ‌రి పైరులా జుట్టు ఒత్తుగా పెర‌గాలంటే ఇది వాడండి..!

Hair Growth Tips : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య‌తో ఎక్కువ‌గా బాధ‌ప‌డుతున్నారు. జుట్టు ఎక్కువ‌గా రాలిపోవ‌డంతో పాటు రాలిన జుట్టు కుదుళ్ల స్థానంలో మ‌ర‌లా కొత్త జుట్టు రాక మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇలా జుట్టు రాల‌డానికి వివిధ కార‌ణాలు ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది హాయిగా ఉంటుంద‌ని జుట్టుపై వేడి నీటిని పోసుకుంటూ ఉంటారు. 40 డిగ్రీల కంటే ఎక్కువ నీటిని త‌ల‌పై పోసుకోవ‌డం వ‌ల్ల వేడి కార‌ణంగా జుట్టు కుదుళ్ల‌ల్లో ఉండే నీరు ఆవిరైపోతుంద‌ని అలాగే జుట్టు కుదుళ్ల‌కు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ కూడా త‌గ్గుతుంద‌ని దీంతో జుట్టు కుదుళ్లు పొడిబారి జుట్టు ఎక్కువ‌గా రాలిపోతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

రోజూ వేడి నీటితో త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల జుట్టు ఎక్కువ‌గా రాలిపోతుంద‌ని వారు చెబుతున్నారు. గోరు వెచ్చ‌ని నీటితోనే త‌ల‌స్నానం చేయాలని అప్పుడే జుట్టు కుద‌ళ్ల‌కు హాని క‌ల‌గ‌కుండా ఉంటుంద‌ని వారు తెలియ‌జేస్తున్నారు. క‌నుక జుట్టు ఎక్కువ‌గా రాలే వారు వేడి నీటితో త‌ల‌స్నానం చేయ‌డం మానేయాలి. దీంతో జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. అలాగే ఊడిన జుట్టు స్థానంలో మ‌ర‌లా జ‌ట్టు రావాలంటే విట‌మిన్ డి, విట‌మిన్ బి12 లోపం లేకుండా చూసుకోవాలి. అలాగే ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. సోయా బీన్స్, మీల్ మేక‌ర్ వంటి ఆహారాల్లో ప్రోటీన్ ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల కొత్త జుట్టు త్వ‌ర‌గా వ‌స్తుంది. అలాగే జుట్టు ఎక్కువ‌గా రావాల‌నుకునే వారు శ‌రీరంలో ర‌క్త‌హీన‌త లేకుండా చూసుకోవాలి. దీనికోసం ఆకుకూర‌ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. ముఖ్యంగా తోట‌కూర‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి.

Hair Growth Tips follow these for better effect
Hair Growth Tips

ర‌క్త‌హీన‌త వ‌ల్ల ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ జ‌రిగ్గా జ‌ర‌గ‌దు. దీంతో జుట్టు కుదుళ్లకు పోష‌కాలు అంద‌క జుట్టు ఎక్కువ‌గా ఊడిపోతుంది. క‌నుక ఆకుకూర‌ల‌ను ఎక్కువ‌గా తీసుకునే ప్ర‌య‌త్నం చేయాలి. ఆకుకూరల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య లేకుండా ఉంటుంది. జుట్టు కుదుళ్ల‌కు పోష‌కాలు చ‌క్క‌గా అంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. వీటితో పాటు బాదంప‌ప్పును కూడా తీసుకోవాలి. బాదంప‌ప్పు జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. బాదంప‌ప్పులో జుట్టుకు అవ‌స‌ర‌మైన ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. రోజూ 10 నుండి 20 బాదం ప‌ప్పుల‌ను నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు పెరుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. ఇలా ఆహారాల‌ను తీసుకుంటూనే నీటిని ఎక్కువ‌గా తాగాలి. నీటిని తాగ‌డం వ‌ల్ల జుట్టు కుదుళ్లు పొడిబార‌కుండా ఉంటాయి. జుట్టు విరిగిపోవ‌డం, జుట్టు చిట్ల‌డం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఈ విధంగా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ చ‌క్క‌టి పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డ‌గం త‌గ్గ‌డంతో పాటుగా రాలిన జుట్టు స్థానంలో జుట్టు త్వ‌ర‌గా వ‌స్తుంద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

D

Recent Posts