Head Spinning : క‌ళ్లు తిర‌గ‌డం, ర‌క్తం తక్కువ‌గా ఉండ‌డం.. ఈ స‌మ‌స్య‌ల‌కు ఎలాంటి ఆహారం తినాలి..?

Head Spinning : సాధార‌ణంగా వ‌య‌స్సు మీద ప‌డిన వారికి త‌ర‌చూ అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. వాటిల్లో క‌ళ్లు తిర‌గ‌డం కూడా ఒక‌టి. కొంద‌రికి ఆ వ‌య‌స్సులో ర‌క్తం త‌క్కువ‌గా ఉంటుంది. అయితే వ‌య‌స్సు మీద ప‌డిన వారిలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం స‌హ‌జ‌మే. అయిన‌ప్ప‌టికీ ఇప్పుడు కాలం అలా లేదు. చాలా మంది యుక్త వ‌య‌స్సులోనే ఈ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. చాలా మందికి క‌ళ్లు తిర‌గ‌డం అనే స‌మ‌స్య వ‌స్తోంది. దీంతోపాటు అలాంటి వారిలో ర‌క్తం కూడా త‌క్కువ‌గానే ఉంటోంది. అయితే ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఎలాంటి ఆహారాల‌ను రోజూ తినాలి.. ఎలాంటి జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క‌ళ్లు తిరిగేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ప‌డిపోవ‌డం, షుగ‌ర్ ఉన్న‌వారు ట్యాబ్లెట్ల‌ను గ‌న‌క వాడుతుంటే షుగ‌ర్ లెవ‌ల్స్ పడిపోవ‌డం, నీళ్ల‌ను త‌క్కువ‌గా తాగ‌డం, మానసిక ఆందోళ‌న ఎక్కువ‌గా ఉండ‌డం, నిద్ర స‌రిగ్గా పోక‌పోవ‌డం.. వంటి ప‌లు కార‌ణాల వ‌ల్ల చాలా మందికి త‌ల తిరిగిన‌ట్లుగా, క‌ళ్లు తిరిగిన‌ట్లుగా అనిపిస్తుంది. అయితే ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నుక క‌నిపిస్తే ఆహారాన్ని 3 పూట‌ల‌కు బ‌దులుగా 5 సార్లు తీసుకోవాలి. కానీ ఆహారాన్ని త‌క్కువ తినాలి. దీంతో మీకు వెంట‌నే ఈ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Head Spinning and anemia what type diet we have to follow
Head Spinning

తాజా పండ్లు, కూర‌గాయ‌ల‌ను తినాలి..

అలాగే పండ్లు, కూర‌గాయ‌లు, ఆకుకూర‌ల‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆయా కాలాల్లో వ‌చ్చే అన్ని ర‌కాల సీజ‌న‌ల్ పండ్ల‌ను తింటుండాలి. ప్ర‌తి రోజూ క‌నీసం 2 లీట‌ర్ల నీళ్ల‌ను అయినా తాగాల్సి ఉంటుంది. కొంద‌రు కాఫీ, టీల‌ను రోజూ ప‌దే ప‌దే తాగుతుంటారు. వీటిని రోజుకు 2 క‌ప్పుల క‌న్నా ఎక్కువ‌గా తాగ‌కూడదు. అదేవిధంగా ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. వెజిటేరియ‌న్లు అయితే బీన్స్‌, ప‌చ్చి బఠానీలు, చిక్కుళ్లు, కాలిఫ్ల‌వ‌ర్‌, క్యాబేజీ, బ్రోక‌లీ, ప‌ప్పు దినుసులు వంటి ఆహారాల‌ను తినాలి. వీటిల్లో ప్రోటీన్లు స‌మృద్ధిగా ఉంటాయి.

అలాగే మాంసాహారులు అయితే కోడిగుడ్లు, చేప‌లు, చికెన్‌, మ‌ట‌న్‌, ప్రాన్స్ వంటివి తింటుండాలి. ప్రోటీన్లు మ‌న శ‌రీరానికి శ‌క్తిని అంద‌జేస్తాయి. క‌ళ్లు తిర‌గ‌డాన్ని త‌క్కువ చేస్తాయి. అలాగే రోజూ రాత్రి 8 గంటల లోపు భోజ‌నం పూర్తి చేసి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు నిద్రించాలి. ఉద‌యం 6 గంట‌ల‌కు నిద్ర లేవాలి. దీంతోపాటు ఒత్తిడి, ఆందోళన త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి. అందుకు గాను మీకు ఇష్ట‌మైన సంగీతాన్ని రోజు 10 నిమిషాల పాటు వినాలి. లేదా డ్యాన్స్ చేయ‌వ‌చ్చు. స్విమ్మింగ్ కు వెళ్ల‌వ‌చ్చు. క్యార‌మ్స్‌, చెస్ లాంటి ఇండోర్ గేమ్స్ ఆడ‌వ‌చ్చు. 30 నిమిషాల పాటు ప‌చ్చ‌ని ప్ర‌కృతిలో వాకింగ్ చేయ‌వ‌చ్చు. యోగా, ధ్యానం కూడా చేయ‌వ‌చ్చు.

జీవ‌న‌శైలిలో మార్పు రావాలి..

ఇలా జీవ‌న‌శైలిని పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల క‌ళ్లు తిర‌గ‌డం, త‌ల తిర‌గ‌డంతోపాటు ర‌క్తం త‌క్కువ‌గా ఉండ‌డం అనే స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. వీటిని త‌గ్గించుకోవాలంటే పైన తెలిపిన ఆహారాలు, సూచ‌న‌లు చ‌క్క‌గా ప‌నిచేస్తాయి. క‌నుక ఆ మేర‌కు జీవ‌న‌శైలిని పాటిస్తే ఎవ‌రైనా స‌రే ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. రోగాలు రాకుండా ఏకంగా 100 ఏళ్ల వ‌ర‌కు బ‌త‌క‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts