Kallu : క‌ల్లు తాగితే ఏం జ‌రుగుతుంది..? ఎవ‌రికీ తెలియ‌ని టాప్ సీక్రెట్ ఇది..!

Kallu : తాటి క‌ల్లు.. ఇది తెలియ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌న‌లో చాలా మంది తాటి క‌ల్లును ఇష్టంగా తాగుతూ ఉంటారు. తాటి క‌ల్లు రుచిగా కూడా ఉంటుంది. తాటిక‌ల్లును తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంద‌ని మ‌న‌లో చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే తాటిక‌ల్లును తాగ‌డం మంచిదేనా… దీనిని తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి మేలు క‌లుగుతుందా.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. తాటి చెట్టు నుండి వ‌చ్చిన ద్రావ‌ణాన్ని నీరా అని అంటారు. నీరా చాలా రుచిగా ఉంటుంది. నీరాను తాటిచెట్టు నుండి సేక‌రించిన 3 నుండి 4 గంట‌ల లోపు తీసుకోవాలి. 100 ఎమ్ ఎల్ నీరాలో 75 క్యాల‌రీల శ‌క్తి ఉంటుంది. దీనిలో కార్బోహైడ్రేట్స్ సుక్రోజ్ రూపంలో ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ సుక్రోజ్ రూపంలో ఉంటాయి క‌నుక షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు దీనిని తాగిన‌ప్ప‌టికి ర‌క్తంలో చక్కెర స్థాయిలు పెర‌గ‌కుండా ఉంటాయి.

నీరాను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నీరాను చెట్టు నుండి తీసిన 12 గంట‌ల లోపు తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌త్తు లేకుండా ఉంటుంది. స‌మ‌యం గ‌డిచే కొద్ది నీరా పులిసి క‌ల్లుగా మారుతుంది. అలాగే ఈ క‌ల్లు పులిసే కొద్ది దీనిలో ఉండే ఈస్ట్ కార‌ణంగా ఆల్క‌హాల్ శాతం కూడా పెరుగుతుంది. క‌ల్లులో 4 నుండి 5 శాతం ఆల్క‌హాల్ ఉంటుంది. అలాగే చాలా మంది ఈ క‌ల్లు మ‌రీ ఎక్కువ‌గా పుల‌వ‌కుండా ఉండ‌డానికి దానిలో క్యాల్షియం హైడ్రాక్సైడ్ అనే ర‌సాయ‌నాన్ని క‌లుపుతారు. అలాగే కొంద‌రు క‌ల్లుల్లో ఆల్క‌హాల్ శాతం పెర‌గ‌డానికి ఈస్ట్ ను, పంచ‌దార‌ను కూడా క‌లుపుతారు. దీంతో ఈస్ట్ క‌ల్లును పులియ‌బెట్టి ఆల్క‌హాల్ శాతాన్ని పెంచుతుంది.

health benefits of drinking Kallu
Kallu

ఇలా పులిసిన క‌ల్లును తీసుకోవ‌డం వ‌ల్ల ఆల్క‌హాల్ ను తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే చెడు ప్ర‌భావం క‌లుగుతుంది. పులిస‌న క‌ల్లును తీసుకోవ‌డం వల్ల మ‌న ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది. శ‌రీరంలో రోగనిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంది. కాలేయ ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. పులిన క‌ల్లు మ‌త్తును ఇస్తుంద‌ని చాలా మంది దీనిని తాగ‌డానికే అల‌వాటు ప‌డ‌తారు. కానీ పులిసిన క‌ల్లును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనారోగ్యానికి గురి కావాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. తాటి చెట్టు నుండి తీసిన నీరాను తాగిన‌ప్పుడే మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌ని వారు చెబుతున్నారు.

D

Recent Posts