రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడంలో, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మూలికలు బాగా పనిచేస్తాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలలో వెల్లడైంది. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు కింద తెలిపిన మూలికలను రోజూ తీసుకోవడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
1. సప్తరంగి.. దీన్నే తెలుగులో కొండ గంగుడు చెట్టు అంటారు. ఇది కఫ దోషానికి చెందిన వ్యాధులను తగ్గిస్తుంది. మధుమేహం నుంచి బయట పడవచ్చు. కాలేయం, క్లోమం పనితీరు మెరుగు పడతాయి. ఈ చెట్టు వేర్ల పొడిని రోజూ 1-2 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. అదే కషాయం అయితే 10-20 ఎంఎల్ మోతాదులో తాగాలి.
2. పొడపత్రి ఆకు చూర్ణం తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీని వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఈ ఆకుల్లో జిమ్నీమిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పిండి పదార్థాలపై ఉండే యావను తగ్గిస్తుంది. ఈ ఆకుల చూర్ణాన్ని రోజూ 3-6 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. కషాయం అయితే 50-100 ఎంఎల్ తాగాలి.
3. డయాబెటిస్‌ను అదుపు చేయడంలో వేప ఆకులు కూడా బాగానే పనిచేస్తాయి. వీటి చూర్ణాన్ని రోజూ తీసుకుంటే శరీర మెటబాలిజం పెరుగుతుంది. ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. వేపాకుల చూర్ణాన్ని రోజుకు 3-6 గ్రాముల మోతాదులో తీసుకోవాలి.
4. నేరేడు విత్తనాల చూర్ణాన్ని రోజూ 3-6 గ్రాముల మోతాదులో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.
5. విజయసారం పొడిని రోజూ 3-6 గ్రాముల మోతాదులో వాడాలి. లేదా డికాషన్‌ను 50-100 ఎంఎల్ మోతాదులో తీసుకోవాలి. షుగర్ తగ్గుతుంది.
6. బిల్వ వృక్షానికి చెందిన కాయలను పొడి చేసి దాన్ని రోజూ 3-6 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. చెట్టు కాయలు పూర్తిగా పండకూడదు. పండని కాయలను ఎండబెట్టి పొడి చేసి దాన్ని వాడాలి. షుగర్ నుంచి బయట పడవచ్చు.
7. షుగర్‌ను తగ్గించడంలో మెంతులు కూడా బాగానే పనిచేస్తాయి. మెంతుల పొడిని రోజూ 2 నుంచి 6 గ్రాముల మోతాదులో వాడితే ఫలితం ఉంటుంది.
8. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇది డయాబెటిస్‌కు ఔషధంగా పనిచేస్తుంది. రోజూ 2-4 గ్రాముల పసుపును తీసుకోవాలి. లేదా పసుపు కొమ్ముల నుంచి తీసిన జ్యూస్‌ను 10-20 ఎంఎల్ మోతాదులో తాగాలి. దీంతో డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.
9. కాకరకాయ రసాన్ని తాగడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. డయాబెటిస్ తగ్గుతుంది. మెటబాలిజం పెరుగుతుంది. రోజూ కాకరకాయ రసాన్ని 10-20 ఎంఎల్ మోతాదులో తాగాలి. కాకరకాయను ఎండబెట్టి చూర్ణం చేసి దాన్ని రోజూ 3-6 గ్రాముల మోతాదులో తీసుకోవచ్చు. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365