భోజ‌నం చేసిన త‌రువాత సోంపును తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలివే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడంటే నిజానికి చాలా మంది పాత అలవాటును మరిచిపోయారు కానీ&period;&period; నిజానికి చాలా మంది భోజనం చేశాక సోంపు గింజలను తినేవారు&period; దీంతో జీర్ణ సమస్యలు వచ్చేవి కావు&period; అయితే సోంపు గింజలతో కేవలం జీర్ణ సమస్యలే కాదు&comma; ఇతర అనారోగ్యాలను కూడా దూరం చేసుకోవచ్చు&period; నిత్యం భోజనం చేశాక సోంపు గింజలను తినడం అలవాటుగా చేసుకుంటే దాంతో పలు ప్రయోజనాలు కలుగుతాయి&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><img class&equals;"aligncenter wp-image-156 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2020&sol;12&sol;health-benefits-of-fennel-seeds-in-telugu&period;jpg" alt&equals;"health benefits of fennel seeds in telugu" width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోంపు గింజల్లో మన శరీరానికి కావల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి&period; ఫైబర్&comma; విటమిన్‌ సి&comma; కాల్షియం&comma; ఐరన్‌&comma; మెగ్నిషియం&comma; పొటాషియం&comma; మాంగనీస్‌ వంటి పోషకాలు లభిస్తాయి&period; వీటితో శరీరానికి పోషణ లభిస్తుంది&period; సోంపు ద్వారా మనకు లభించే విటమిన్‌ సితో శరీర రోగ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది&period; కణజాలానికి శరీరం మరమ్మత్తులు చేసుకుంటుంది&period; కణాలు నాశనం కూడా ఉంటాయి&period; సోంపు గింజల్లో ఉండే మాంగనీస్‌ శరీర మెటబాలిజంను పెంచుతుంది&period; కణజాలాన్ని రక్షిస్తుంది&period; ఎముకలను వృద్ధి చేస్తుంది&period; షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌ అవుతాయి&period; గాయాలు త్వరగా మానుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోంపు గింజల్లో పవర్‌ఫుల్‌ యాంటీ ఆక్సిడెంట్లు&comma; శక్తివంతమైన మొక్కల ఆధారిత సమ్మేళనాలు ఉంటాయి&period; 87 రకాలకు పైగా ముఖ్యమైన సమ్మేళనాలు ఈ గింజల్లో ఉంటాయి&period; రోజ్‌మరీనిక్‌ యాసిడ్‌&comma; క్లోరోజెనిక్‌ యాసిడ్‌&comma; క్వర్సెటిన్‌&comma; అపిజెనిన్‌ అనబడే సమ్మేళనాలు ఉంటాయి&period; ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి&period; అందువల్ల గుండె జబ్బులు&comma; స్థూలకాయం&comma; క్యాన్సర్‌&comma; నాడీ సంబంధ వ్యాధులు&comma; టైప్‌ 2 డయాబెటిస్‌ రాకుండా ఉంటాయి&period; సోంపు గింజల్లో యాంటీ క్యాన్సర్‌&comma; యాంటీ మైక్రోబియల్‌&comma; యాంటీ వైరల్‌ గుణాలు కూడా ఉంటాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది&period; సోంపు గింజల్లో ఉండే లిమోనీన్‌ అనబడే సమ్మేళనం హానికారక ఫ్రీ ర్యాడికల్స్‌ నుంచి రక్షణ అందిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆకలిని నియంత్రించే గుణాలు సోంపు గింజల్లో ఉంటాయి&period; ఆకలి ఎక్కువగా అవుతుందని అనుకునే వారు సోంపు గింజలను తిని చూస్తే ఫలితం ఉంటుంది&period; లంచ్‌ చేసేముందు కొందరికి సైంటిస్టులు సోంపు గింజలతో చేసిన టీ ఇచ్చారు&period; దీంతో వారు తక్కువ ఆహారాన్ని తీసుకున్నట్లు గుర్తించారు&period; అందువల్ల సోంపు గింజలతో అధిక బరువు కూడా తగ్గవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోంపు గింజలను తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి&period; వీటిలో ఉండే ఫైబర్‌ గుండె జబ్బులు వచ్చే అవకాశాలను చాలా వరకు తగ్గిస్తుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది&period; అలాగే సోంపు గింజల్లో ఉండే మెగ్నిషియం&comma; పొటాషియం&comma; కాల్షియం వంటి పోషకాలు గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోంపు గింజల్లో క్యాన్సర్‌ కు వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఉన్నాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది&period; వీటిలో ఉండే ఎనిథోల్‌ అనబడే సమ్మేళనం క్యాన్సర్‌ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుందని గుర్తించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోంపు గింజల్లో గలాక్టోజెనిక్‌ గుణాలు ఉన్నాయి&period; అంటే పాలిచ్చే తల్లులు వీటిని తీసుకుంటే పాలు సమృద్ధిగా వస్తాయి&period; అందువల్ల పాలిచ్చే తల్లులు వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవచ్చు&period; అయితే అందుకు డాక్టర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భోజనం చేసిన తరువాత సోంపు గింజలను తినడం వల్ల జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది&period; తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది&period; మలబద్దకం సమస్య ఏర్పడదు&period; గ్యాస్‌&comma; అసిడిటీ రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts