అనేక రకాల శాకాహార, మాంసాహార వంటకాల్లో రోజూ చాలా మంది గరం మసాలా పొడిని వేస్తుంటారు. గరం మసాలా పొడి అంటే అనేక రకాల మసాలా దినుసులను కలిపి తయారు చేసే పొడి. దీన్ని వాడడం వల్ల వంటకు చక్కని వాసన, రుచి వస్తాయి. అయితే అందుకే కాదు, మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించడంలోనూ గరం మసాలా పొడి పనిచేస్తుంది. దీంతో కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
* దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు ఈ సీజన్‌లో మామూలే. అయితే గరం మసాలా పొడిని ఉపయోగించి వంటలను చేసుకుని తింటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
* గరం మసాలా పొడితో జీర్ణశక్తి మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
* గరం మసాలాలో ఉండే దినుసుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి.
* డయాబెటిస్ సమస్య ఉన్నవారికి గరం మసాలా పొడి ఎంతో మేలు చేస్తుంది. ఇది షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది.
* గరం మసాలా పొడిలో అనేక దినుసులు ఉంటాయి. వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి.
అయితే గరం మసాలా పొడి వల్ల మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగినప్పటికీ ఆ పొడిని అధిక మోతాదులో తీసుకోరాదు. దాని వల్ల పైల్స్, గుండెల్లో మంట, అసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి. కనుక ఆ పొడిని రోజూ మోతాదులో వాడుకోవాలి. దీంతో పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి.