సూపర్ మార్కెట్లలో వీటిని చాలా మంది గమనించే ఉంటారు. వీటినే మఖనాలని పిలుస్తారు. ఇంగ్లిష్‌లో అయితే ఫాక్స్ నట్స్ అంటారు. మనకు అందుబాటులో ఉండే అనేక రకాల నట్స్ లలో ఇవి కూడా ఒకటి. వీటితో కూర చేసుకుని తింటారు. మఖనాలలో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* తామర పువ్వుల నుంచి విత్తనాలను సేకరించి వాటిని శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెడతారు. కొన్ని గంటల తరువాత అవి బాగా ఎండిపోతాయి. వాటిని పెనంపై వేసి అధిక ఉష్ణోగ్రత వద్ద రోస్ట్ చేస్తారు. దీంతో పాప్ కార్న్‌లా మఖనాలు తయారవుతాయి. వీటితో అనేక రకాల వంటలను చేసుకుని తింటారు. వీటిల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పోషణను అందిస్తాయి.
* మఖనాలలో ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల మనం వాటిని తింటే ఆరోగ్యంగా ఉంటాం. అనారోగ్యాలు రాకుండా జాగ్రత్తగా ఉండవచ్చు.
* మఖనాలలో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. చురుగ్గా ఉంటారు.
* వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులను రాకుండా చూస్తాయి.
* ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడుతున్న వారు తరచూ మఖనాలను తింటే ఫలితం ఉంటుంది.
* డయాబెటిస్ ఉన్నవారు వీటిని నిర్భయంగా తినవచ్చు. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.
* మఖనాలలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి. అందువల్ల వీటిని తరచూ తింటుంటే చర్మం మెరుస్తుంది. మొటిమలు, ముడతలు తగ్గుతాయి.
* కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా ఉన్నవారు మఖనాలను తింటే ఆ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.