పనీర్.. దీన్నే ఇండియన్ కాటేజ్ చీజ్ అంటారు. ఇందులో అనేక విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. సాధారణంగా శాకాహారులు తమకు ప్రోటీన్లు సరిగ్గా లభించవని ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారు పనీర్‌ను తింటే పుష్కలంగా ప్రోటీన్లు లభిస్తుంది. దీన్ని తరచూ తినవచ్చు. భిన్న రకాలుగా పనీర్‌ను వండుకుని తినవచ్చు. దీని వల్ల మనకు కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పనీర్‌లో పోషకాలు అధికంగా ఉంటాయి. ప్రొటీన్లు, కాల్షియం, జింక్, మెగ్నిషియంలు పనీర్‌లో పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల మన శరీరానికి శక్తి, పోషణ రెండూ లభిస్తాయి. పనీర్‌లో విటమిన్ బి12, డి, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, ఎ లు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆస్టియోపోరోసిస్ రాకుండా చూస్తాయి.
2. పనీర్‌లో ఉండే మెగ్నిషియం రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. పనీర్‌ను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
3. పనీర్‌లో ఉండే ఫాస్ఫరస్ మలబద్దకం రాకుండా చూస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
4. పనీర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు రావు.
5. పనీర్‌ను తీసుకోవడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. కొవ్వు కరిగి అధిక బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
6. పనీర్‌లో సెలీనియం, పొటాషియంలు అధికంగా ఉంటాయి. అందువల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
7. గర్భిణీలకు ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 ఎంతగానో అవసరం. అందువల్ల వారు పనీర్‌ను తీసుకుంటే ఆ రెండు పోషకాలు లభిస్తాయి. దీంతో గర్భిణీలతోపాటు శిశువులు ఆరోగ్యంగా ఉంటారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365