Health Tips : ప్రస్తుత తరుణంలో చాలా మంది కుర్చీల్లో, బెడ్‌పై, డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం చేస్తున్నారు. నేలపై కూర్చుని ఎవరూ భోజనం చేయడం లేదు. కానీ నేలపై కూర్చుని భోజనం చేస్తే అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థకు సహకారం లభిస్తుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది.
నేలపై కూర్చుని భోజనం చేయడం బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. పొట్ట దగ్గరి కండరాలు ఉత్తేజితం అవుతాయి. దీంతో బరువు తగ్గడం సులభతరం అవుతుంది.
నేలపై కూర్చుని భోజనం చేస్తే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. బీపీ అదుపులో ఉంటుంది.
నేలపై కూర్చుని తింటే శరీర భంగిమ సరిగ్గా మారుతుంది. వెన్నెముక సమస్యలు రావు.
ఈ విధంగా నేలపై కూర్చుని తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.