Sweat Smell : చెమట, దుర్వాసన బాగా ఉన్నాయా ? ఈ సులభమైన చిట్కాలను పాటించండి..!

Sweat Smell : వేసవిలో ఎవరికైనా సరే సహజంగానే చెమట పడుతుంటుంది. దీంతో కొందరికి చెమట వాసన కూడా వస్తుంటుంది. అయితే కొందరి ఇతర సీజన్లలోనూ విపరీతంగా చెమట పట్టడమే కాక.. చెమట దుర్వాసన వస్తుంటుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే కింద తెలిపిన చిట్కాలను పాటించాలి. అవేమిటంటే..

home remedies for sweat and smell

1. ఒక టీస్పూన్‌ బేకింగ్‌ సోడాను తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి మిశ్రమంగా చేసి దాన్ని చెమట పట్టే ప్రదేశాల్లో రాయాలి. ఒక గంట తరువాత కడిగేయాలి. దీంతో చెమట, దుర్వాసన తగ్గుతాయి.

2. టమాటాను గుజ్జులా చేసి చెమట పట్టే ప్రదేశాల్లో రాసుకుంటుంటే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు.

3. చెమట పట్టే ప్రదేశాల్లో టీ ట్రీ ఆయిల్‌ను కూడా రాసుకోవచ్చు. ఇది కూడా అధిక చెమటను, దుర్వాసనను తగ్గిస్తుంది.

4. ఒక కప్పు వేడి నీటిలో ఒక గ్రీన్‌ టీ బ్యాగును వేసి కొంత సేపు ఉంచి తీసేయాలి. అనంతరం ఏర్పడే మిశ్రమాన్ని చెమట పట్టే ప్రదేశాల్లో రాసుకోవాలి. ఇలా చేస్తున్నా సమస్య తగ్గుతుంది.

5. నిమ్మకాయను అడ్డంగా కోసి ఒక ముక్కను తీసుకుని చెమట పట్టే ప్రదేశంలో బాగా రుద్దాలి. తరువాత 15 నిమిషాలు ఆగి స్నానం చేయాలి. ఇది చాలా సులభమైన పద్ధతి. రోజూ పాటిస్తే చెమట, దుర్వాసన తగ్గుతాయి.

Share
Admin

Recent Posts