Health Tips : చేతి 5 వేళ్లను ఇలా మసాజ్ చేస్తే 10 రోగాలు మాయం..!

Health Tips : మ‌న శ‌రీరంలో ప్ర‌తిభాగం కూడా ఎంతో విలువైన‌ది. అలాగే ప్ర‌తి అవ‌య‌వానికి ఇత‌ర అవ‌య‌వాల‌తో సంబంధం ఉంటుంది. ఇలా మ‌న శ‌రీర భాగాల్లో ఒక‌టైన చేతి వేళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక చేతి వేళ్ల‌కు మ‌రో చేతితో మర్ద‌నా చేయ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఎన్నో మార్పులు జ‌రుగుతాయి. వేళ్ల‌ను రుద్ద‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వేళ్ల‌ను రుద్ద‌డం వ‌ల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌డం ఏంటి అని మ‌న‌లో చాలా మంది సందేహం వ్య‌క్తం చేస్తుంటారు. కానీ ఇది నిజం. వేళ్లు శ‌రీరంలోని అనేక అవ‌య‌వాల‌తో అనుసంధానం అయ్యి ఉంటాయి. కాబ‌ట్టి వేళ్ల‌కు మ‌ర్దనా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో విభిన్న మార్పులు చోటు చేసుకుంటాయి.

ఒక్కో వేలును రుద్ద‌డం వ‌ల్ల ఒక్కో ప్ర‌యోజ‌నం ఉంటుంది. బొట‌న వేలి నుండి చిటికిన వేలు వ‌ర‌కు ఒక్కో వేలుకు ఒక్కో అవ‌య‌వం అనుసంధాన‌మై ఉంటుంది. బొట‌న వేలు ఊపిరితిత్తుల‌కు అనుసంధాన‌మై ఉంటాయి. కాబ‌ట్టి గుండె ద‌డ‌, శ్వాస స‌రిగ్గా ఆడ‌క‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు బొట‌న వేలును ఒక నిమిషం నుండి రెండు నిమిషాల పాటు రుద్ద‌డం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌ల నుండి చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు. అలాగే చూపుడు వేలు పొట్ట‌లోని పెద్ద ప్రేగుతో అనుసంధాన‌మై ఉంటుంది. మ‌ల‌బ‌ద్ద‌కం, డ‌యేరియా వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు చూపుడు వేలుకు 60 సెక‌న్ల పాటు మ‌ర్ద‌నా చేయాలి.

Health Tips massage your fingers in this way for many benefits
Health Tips

ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్దకం, డ‌యేరియా వంటి జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఇక అల‌స‌ట‌, నిద్ర‌లేమి, ప్ర‌యాణ స‌మ‌యాల్లో ఇబ్బంది ప‌డేవారు మ‌ధ్య వేలు వెనుక భాగాన్ని కొన్ని సెక‌న్ల పాటు రుద్దాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల తేలిక‌గా నిద్ర ప‌డుతుంది. ఇలా మ‌ధ్య వేలు వెనుక భాగాన మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల వివిధ స‌మ‌స్య‌ల నుండి సుల‌భంగా ఉప‌శ‌మనాన్ని పొంద‌వ‌చ్చు. మ‌ల‌బ‌ద్ద‌కంతోపాటు ఇత‌ర జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఉంగ‌రం వేలుకు మ‌ర్ద‌నా చేయాలి. ఉంగ‌రం వేలు పొట్ట‌లోని కండ‌రాల‌తో అనుసంధాన‌మై ఉంటుంది. ఇలా ఉంగ‌రం వేలుకు మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు.

ఇక చివ‌రి వేలు చిటికెన వేలు. మైగ్రేన్, మెడ నొప్పి వంటి స‌మ‌స్య‌లు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌స‌రిగ్గా జ‌ర‌గ‌న‌ప్పుడు వ‌స్తాయి. ఇలాంటి స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డాలంటే చిటికెన వేలుకు 60 సెక‌న్ల పాటు మ‌ర్ద‌నా చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌ల నుండి చాలా తేలిక‌గా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఈ విధంగా వేళ్ల‌కు మ‌ర్దనా చేయ‌డం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌ల నుండి క‌చ్చితంగా ఉప‌శమ‌నాన్ని పొందుతార‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts