Health Tips : తీవ్రమైన తలనొప్పి ఎక్కువ రోజుల పాటు ఉంటే దాన్ని మైగ్రేన్ అంటారు. ఇది తలకు కేవలం ఒక వైపు మాత్రమే పొడిచినట్లుగా వస్తుంటుంది. మైగ్రేన్ వస్తే ఆ బాధ భరించలేరు. 2-3 రోజుల వరకు తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. తరువాత తగ్గిపోతుంది. లేదా మరింత ఎక్కువవుతుంది. అయితే మైగ్రేన్ సమస్య ఉన్నవారు పలు ఆహారాలను తీసుకోరాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటంటే..
1. మైగ్రేన్ సమస్య ఉన్నవారు చాకొలెట్లను అస్సలు తినరాదు. తింటే సమస్య మరింత ఎక్కువవుతుంది. మైగ్రేన్ ఉన్నవారు చాకొలెట్లను తింటే నొప్పి ఎక్కువయ్యే అవకాశాలు 22 శాతం వరకు పెరుగుతాయని సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది. కనుక మైగ్రేన్ ఉన్నవారు చాకొలెట్లను తినరాదు.
2. కెఫీన్ అధికంగా ఉండే కాఫీ, టీ, గ్రీన్ టీలను ఎక్కువగా తాగినా మైగ్రేన్ అటాక్ అవుతుంది. కనుక వీటి మోతాదు తగ్గించాలి.
3. చీజ్ తీసుకున్నవారిలో మైగ్రేన్ అటాక్ అయ్యే అవకాశాలు 35 శాతం వరకు ఉంటాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. కనుక చీజ్‌ను కూడా తినరాదు.
4. ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్‌ను తినడం వల్ల కూడా మైగ్రేన్ తీవ్రమవుతుంది. షుగర్ ఫ్రీ పేరిట కొందరు పిల్స్ లేదా పొడి వాడుతారు. దాన్ని మానేయాలి.
5. మోనోసోడియం గ్లూటమేట్ లేదా ఎంఎస్‌జీ ఉన్న ఆహారాలను కూడా తినరాదు. దీన్నే టేస్టింగ్ సాల్ట్ అంటారు. ఇది ఎక్కువగా చైనీస్ ఫాస్ఠ్ ఫుడ్‌లో కలుస్తుంది. కనుక వాటిని తినరాదు.
6. నిల్వ చేయబడిన మాంసం తిన్నా మైగ్రేన్ సమస్య ఎక్కువవుతుంది. కనుక మాంసాహారాలను తాజాగా ఉండగానే తినేయాలి. నిల్వ ఉంచి తినరాదు.