Healthy Foods For Liver Detox : రోజూ గుప్పెడు చాలు.. లివ‌ర్ శుభ్ర‌మ‌వుతుంది.. అన్ని ర‌కాల విట‌మిన్లు ల‌భిస్తాయి..!

Healthy Foods For Liver Detox : మ‌న శ‌రీరంలో ఎక్కువ విధుల‌ను నిర్వ‌ర్తించే అవ‌య‌వాల్లో కాలేయం ఒక‌టి. ఇది సుమారు కిలోన్న‌ర బ‌రువు ఉంటుంది. హార్మోన్ల‌ను, ఎంజైమ్ ల‌ను ఉత్ప‌త్తి చేయ‌డంలో, మ‌న శ‌రీరంలో ఉండే విష ప‌దార్థాల‌ను తొల‌గించ‌డంలో, శ‌రీరంలో జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌ర్తించ‌డంలో, మ‌నం తీసుకునే ఆహారంలో ఉండే కొవ్వుల‌ను జీర్ణం చేయ‌డంలో ఇలా అనేక ర‌కాల విధుల‌ను కాలేయం నిర్వ‌ర్తిస్తుంది. అయితే మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా కాలేయంపై తీవ్ర‌మైన చెడు ప్ర‌భావం ప‌డుతుంది. దీంతో కాలేయ ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. కాలేయ ఆరోగ్యం దెబ్బ‌తింటే మ‌న శ‌రీర ఆరోగ్యం కూడా దెబ్బ‌తింటుంది. మ‌నం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వ‌స్తుంది.

ఈ పరిస్థితి మ‌న‌కు రాకుండా ఉండాలంటే మ‌నం కాలేయ ఆరోగ్యంపై త‌గినంత శ్ర‌ద్ద తీసుకోవాలి. మ‌న జీవ‌న విధానాన్ని, ఆహారపు అల‌వాట్ల‌ను మార్చుకోవాలి. అస‌లు కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బ‌తీసే వాటి గురించి మ‌నం ముందుగా తెలుసుకుంటే మ‌నం సుల‌భంగా కాలేయం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు. కాలేయం ఆరోగ్యాన్ని దెబ్బ‌తీసే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బ‌తీసే వాటిలో మ‌ధ్య‌పానం కూడా ఉంటుంది. మ‌నం తీసుకునే ఆల్క‌హాల్ ను పూర్తిగా విచ్చినం చేసి మన శ‌రీరానికి హాని క‌ల‌గ‌కుండా కాపాడ‌డంలో కాలేయం దోహ‌ద‌ప‌డుతుంది. ఆల్క‌హాల్ ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయ క‌ణాలు వాటిని విచ్ఛిన్నం చేయ‌లేక దెబ్బ‌తింటాయి. క‌నుక మద్య‌పానానికి దూరంగా ఉండాలి. అలాగే చాలా మంది పోష‌కాహారాన్ని తీసుకోరు. కాలేయ క‌ణాలు మృత‌క‌ణాల‌ను బ‌య‌ట‌కు పంపించాలంటే వాటికి పోష‌కాలు చాలా అవ‌స‌రం.

Healthy Foods For Liver Detox take daily for many benefits
Healthy Foods For Liver Detox

విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, బి కాంప్లెక్స్ విట‌మిన్స్, ఆమైనో యాసిడ్లు ఇలా అనేక ర‌కాల పోష‌కాలు కాలేయ క‌ణాల‌కు అవ‌స‌ర‌మ‌వుతాయి. ఈ పోష‌కాల‌ను తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు కాలేయ క‌ణాల‌ను దెబ్బ‌తీస్తాయి. క‌నుక పండ్ల‌ను, జ్యూస్ ల‌ను, డ్రై ఫ్రూట్స్, డ్రై న‌ట్స్, మొల‌కెత్తిన గింజ‌లు వంటి వాటిని తీసుకోవాలి. ఇక ఊబ‌కాయం, జంక్ ఫుడ్ ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుంది. నూనెలో వేయించిన ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శరీరంలో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోతుంది. దీంతో శ‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ వ‌చ్చి కాలేయ క‌ణాలు దెబ్బ‌తిన‌డంతో పాటు ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య కూడా తలెత్తుతుంది. దీంతో కాలేయ క‌ణాలు దెబ్బ‌తింటాయి.

అదే విధంగా హెప‌టైటిస్ ఎ, హైప‌టైటిస్ బి వంటి వైర‌స్ లు కూడా కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తాయి. అలాగే మ‌నం తీసుకునే మందుల ద్వారా కూడా కాలేయ క‌ణాల ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. చాలా మంది విట‌మిన్స్ కు సంబంధించిన స‌ప్లిమెంట్స్ ను తీసుకుంటూ ఉంటారు. వీటి వ‌ల్ల కూడా కాలేయ క‌ణాలు పాడవుతాయి. ఇక ధూమ‌పానం కార‌ణంగా కూడా కాలేయం దెబ్బ‌తింటుంది. ధూమ‌పానం చేయ‌డం వ‌ల్ల క్ర‌మంగా కాలేయ క‌ణాల‌కు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మంద‌గిస్తుంది. దీంతో క్ర‌మంగా కాలేయం దెబ్బ‌తింటుంది. అలాగే శారీర‌క వ్యాయామం, శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల కూడా కాలేయ ఆరోగ్యం పాడ‌వుతుంది.

అలాగే షుగ‌ర్ వ్యాది కార‌ణంగా, షుగ‌ర్ ఎక్కువ‌గా ఉండే ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా కాలేయ ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. అదే విధంగా మ‌న‌లో చాలా మంది నీటిని స‌రిగ్గా తాగ‌రు. నీటిని తాగ‌క‌పోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో ఆమ్ల‌త్వం పెరుగుతుంది. దీంతో కాలేయ క‌ణాలు స‌రిగ్గా డిటాక్సిఫికేష‌న్ చేయ‌లేక దెబ్బతింటాయి. ఇలా మ‌న అల‌వాట్లు, మ‌నం తీసుకునే ఆహారం కాలేయ ఆరోగ్యంపై తీవ్ర‌మైన చెడు ప్ర‌భావాన్ని చూపిస్తాయి. ఇవి క్ర‌మంగా కాలేయ ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బ‌తీస్తాయి. క‌నుక ఈ అల‌వాట్ల‌ను మార్చుకోవ‌డంతో పాటు మ‌నం తీసుకునే ఆహారంలో కూడా చాలా జాగ్ర‌త్త తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts