Beans Kura : బీన్స్ కూర‌ను ఇలా చేయండి.. ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు..!

Beans Kura : మ‌నం బీన్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె బీన్స్ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఎక్కువ‌గా ఫ్రైడ్ రైస్, వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ, చైనీస్ వంట‌కాల్లో ఎక్కువ‌గా వాడుతూ ఉంటాము. అలాగే వీటితో ఫ్రై, కూర వంటి వాటిని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. బీన్స్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఈ ప్రై ను త‌రుచూ ఒకేవిధంగా కాకుండా ఉల్లికారం వేసి మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉల్లికారం వేసి చేసే ఈ బీన్స్ ప్రై చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తిన‌డానికి, సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. మ‌రింత రుచిగా, క‌మ్మ‌గా ఉల్లికారం వేసి ఈ బీన్స్ ప్రైను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బీన్స్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు – 2 టీ స్పూన్స్, ఎండుమిర్చి – 5 లేదా 6, చింత‌పండు – కొద్దిగా, వెల్లుల్లి రెబ్బ‌లు -6, త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ఫ్రెంచ్ బీన్స్ – పావుకిలో, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Beans Kura recipe in telugu very tasty make like this
Beans Kura

బీన్స్ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో ధ‌నియాలు, ఎండుమిర్చి, చింత‌పండు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత అదే జార్ లో వెల్లుల్లి రెబ్బ‌లు, ఉల్లిపాయ వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు దినుసులు, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత బీన్స్ ముక్క‌లు, ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. వీటిని మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ వేయించాలి. బీన్స్ ముక్క‌లు పూర్తిగా వేగిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ఉల్లికారం వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి చిన్న మంట‌పై 10 నిమిషాల పాటు వేయించాలి. చివర‌గా కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బీన్స్ ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. బీన్స్ ను తిన‌ని వారు కూడా ఈ విధంగా త‌యారు చేసిన ఫ్రైను ఇష్టంగా తింటారు.

D

Recent Posts