Heart Blocks : ప్రస్తుత కాలంలో చాలా మంది హార్ట్ ఎటాక్ తో మరణిస్తున్నారు. యుక్త వయసులోనే చాలా మంది హార్ట్ ఎటాక్ తో మరణిస్తున్నారు. హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణం రక్తనాళాలు మూసుకుపోవడమే. దీని వల్ల రక్త సరఫరాలో అడ్డంకులు ఏర్పడి హార్ట్ ఎటాక్ సమస్య తలెత్తుతుంది. రక్తనాళాలు మూసుకుపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల, కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల, రక్తం గడ్డకట్టడం వల్ల, రక్తనాళాల్లో క్యాల్షియం నిల్వలు పేరుకుపోవడం వల్ల, ప్లేట్లెట్స్ పేరుకుపోవడం వల్ల రక్తనాళాలు మూసుకుపోయి హార్ట్ ఎటాక్ సమస్య తలెత్తుతుంది. బైపాస్ ఆపరేషన్ ద్వారా లేదా స్టంట్స్ వేయడం ద్వారా రక్తనాళాల్లో పేరుకుపోయిన ఈ పూడికలను మనం నిరోధించుకోవచ్చు.
అయితే ఆపరేషన్ అవసరం లేకుండా రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను గుండె దానంతట అదే తొలగిస్తుందని కొంతమంది గుండె సంబంధిత నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో రాజస్థాన్ రాష్ట్రంలోని బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలోని నిపుణులు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. రక్తనాళాల్లో పూడికలు ఏర్పడిన వారిపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని వారు చెబుతున్నారు. అయితే రక్తనాళాల్లో ఉండే పూడికలు తొలగిపోవాలంటే మనం కొన్ని నియమాలను పాటించాలని వారు చెబుతున్నారు. ఇందులో మొదటిది ఆహారం. మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఉప్పు, కొవ్వు పదార్థాలను సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి.
మనం తీసుకునే ఆహారంలో పండ్ల రసాలను, డ్రై నట్స్ ను, మొలకెత్తిన గింజలను, పండ్లను, సలాడ్స్ లను 60 నుండి 70 శాతం ఉండేలా చూసుకోవాలి. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. శరీరం అలసటకు గురి కాకుండా ప్రాణ వాయువు శరీరంలోకి ఎక్కువగా వెళ్లే వ్యాయామాలు చేయాలి. ఏరోబిక్స్, ప్రాణాయామం వంటి వాటిని చేయాలి. రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా 45 నిమిషాల పాటు ఈ వ్యాయామాలను చేయాలి. అలాగే ఒత్తిడి మన దరి చేరకుండా చూసుకోవాలి. ఒత్తిడి కారణంగా గుండెకు రక్తప్రసరణ తగ్గుతుంది. కనుక ఒత్తిడి తగ్గడానికి మెడిటేషన్ ను రోజుకు రెండు పూటలా చేయాలి.
ముఖ్యంగా బ్రహ్మ కుమారీ ఆశ్రమంలో చేసే రాజయోగ మెడిటేషన్ ను చేయడం వల్ల ఒత్తిడి స్థాయిలు ఎక్కువగా తగ్గి రక్తనాళాలు పునరుద్దరించబడుతున్నాయని వారు పరిశోధనల ద్వారా నిరూపించారు. ఈ మూడు నియమాలను పాటించడం వల్ల 6నెలల నుండి సంవత్సరం లోపే రక్తనాళాల్లో పేరుకుపోయిన పూడికలను గుండె తనంతట తానే తొలగించుకుంటుందని వారు సూచిస్తున్నారు. రక్తనాళాల్లో పూడికలు తక్కువగా ఉండి ప్రాణాపాయం లేని వారు ఈ పద్దతులను పాటించడం వల్ల ఆపరేషన్ అవసరం లేకుండా రక్తనాళాల్లో పూడికలు తొలగిపోతాయని గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.