Instant Rava Vadalu : ర‌వ్వ వ‌డ‌ల‌ను ఇలా ఇన్‌స్టంట్‌గా అప్ప‌టిక‌ప్పుడు చేయ‌వ‌చ్చు.. రుచిగా ఉంటాయి..!

Instant Rava Vadalu : మ‌నం త‌యారు చేసుకునే అల్పాహారాల్లో వ‌డ‌లు కూడా ఒక‌టి. వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. చ‌ట్నీ, సాంబార్ తో తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. అయితే ఈ వ‌డ‌ల‌ను త‌యారు చేయ‌డానికి మ‌నం మిన‌ప‌ప్పును ఉప‌యోగిస్తూ ఉంటాము. మిన‌ప‌ప్పుతో చేసే వ‌డ‌లు రుచిగా ఉన్న‌ప్ప‌టికి పప్పు నాన‌డానికి స‌మ‌యం ఎక్కువ‌గా ప‌డుతుంది. అయితే మ‌నం ప‌ప్పును నాన‌బెట్టి రుబ్బే ప‌ని లేకుండా అప్ప‌టికప్పుడు ర‌వ్వ‌తో ఇన్ స్టాంట్ గా వ‌డ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ర‌వ్వ‌తో చేసే ఈ వ‌డ‌లు క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ప‌ప్పు రుబ్బే ప‌నిలేకుండా ర‌వ్వ‌తో వ‌డ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి….అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ర‌వ్వ వ‌డ‌లు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బొంబాయి ర‌వ్వ – ఒక క‌ప్పు, పెరుగు – ముప్పావు క‌ప్పు, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు -త‌గినంత‌, వంట‌సోడా – రెండు చిటికెలు, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Instant Rava Vadalu recipe in telugu make in this way
Instant Rava Vadalu

ర‌వ్వ వ‌డ‌లు త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో ర‌వ్వ‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో పెరుగు త‌ప్ప మిగిలిన ప‌దార్థాలు వేసి క‌ల‌పాలి. త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి. అవ‌స‌ర‌మైతే కొద్దిగా నీళ్లు పోసుకుని క‌లుపుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత మ‌రికొద్దిగా నీళ్లు పోసి వ‌డ పిండి మాదిరి ర‌వ్వ మిశ్ర‌మాన్ని సిద్దం చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కొద్ది కొద్దిగా ర‌వ్వ మిశ్ర‌మాన్ని తీసుకుంటూ చేత్తో వ‌డ‌లాగా వ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి. ఈ వ‌డ‌ల‌ను మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇన్ స్టాంట్ ర‌వ్వ వ‌డ‌లు త‌యార‌వుతాయి. వీటిని చ‌ట్నీ, సాంబార్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. వీటిని అల్పాహారంగా లేదా స్నాక్స్ గా కూడా తీసుకోవ‌చ్చు. ఒక్క‌టి కూడా మిగ‌ల్చ‌కుండా ఈ వ‌డ‌ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts