హెల్త్ టిప్స్

పడక గదిలో భార్య మనసు ఇలా గెలవండి

కంచం దగ్గర మంచం దగ్గర మొహమాటం ఉండకూడదంటారు పెద్దలు. డైనింగ్ రూమ్ లోనూ.. బెడ్ రూమ్ లో వ్యవహారాలు సాఫీగా ఉన్నప్పుడే ఏ సంసారమైనా సజావుగా సాగుతుంటుంది. మరి బెడ్ రూమ్ లో భార్యను ప్రసన్నం చేసుకునేదెలా.. స్వర్గ సౌఖ్యాలు పొందేదెలా.. భర్తలు ముందు చేయాల్సిన పని ఏంటంటే భార్యతో ముచ్చట్లు కలపడం. అందులోనూ శృంగారానికి సంబంధించిన జోక్స్ వేస్తే వారు సంతోషిస్తారు.

కొందరు మహిళల్లో ఇంకా శృంగారం అంటే అదో తప్పుపని అన్న ఫీలింగ్ ఉంటుంది. కుటుంబ వాతావరణం, పెంపకంలో ఏర్పడిన అభిప్రాయాలు వంటివి అందుకు కారణం కావచ్చు. అందుకే సెక్స్ సృష్టిలో అత్యంత సహజమైనదనీ, దీన్ని మనసారా హాయిగా అస్వాదించామని, ఆనందించమని చెప్పాలి.

here it is how couple behave in bed room

అలాగని బెడ్ రూమ్ లో బలవంతం చేస్తే మొదటికే మోసం వస్తుంది. సెక్స్ కోసం భార్యను ఎప్పటికీ బలవంత పెట్టరాదు. ఆమెకు అనుగుణంగా మీరు నడుచుకుంటే మీ కోరికను మీరు ఆనందంగా నెరవేర్చుకోవచ్చు. శృంగారంలో పరస్పర సంతృప్తి అవసరం అని వారికి తెలిసేలా చేయాలి.

తన భార్య సెక్స్ లో తనతో సహకరించేలా మానసికంగా మార్పు తెచ్చేందుకు కూడా భర్త ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఒక్కోసారి రోమాంటిక్ వీడియోలు మీ మధ్య శృంగారానికి అవసరమైన వాతావరణం కలిగిస్తాయి. మీరు మీ భాగస్వామిని శృంగారం అనే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి ఆమెకు ముందుగా ఏదైనా సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి. ఇలాంటి టెక్నిక్స్ పాటిస్తే.. పడక గదిలో స్వర్గ సౌఖ్యాలు మీ సొంతం.

Admin

Recent Posts