Holy Basil Water : తులసి ఆకులతో ఇలాచేస్తే ఎలాంటి దగ్గు, జలుబు అయినా మాయం

Holy Basil Water : వ‌ర్షాకాలంలో ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక స‌మ‌యంలో ద‌గ్గు, జ‌లుబుల బారిన ప‌డుతూ ఉంటారు. జులుబు కార‌ణంగా ముక్కు రంధ్రాలు మూసుకుపోయి చాలా ఇబ్బందిగా ఉంటుంది. జలుబు కార‌ణంగా జ్వ‌రం, త‌ల‌నొప్పి వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంటుంది. అలాగే పొడి ద‌గ్గు కూడా మ‌న‌ల్ని ఎంతో ఇబ్బంది పెడుతుంది. ఈ పొడి ద‌గ్గు ప‌గ‌టి పూట కంటే రాత్రి స‌మ‌యాల్లో ఎక్కువ‌గా ఇబ్బందికి గురి చేస్తుంది. నిద్ర ప‌ట్ట‌కుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కొన్ని ర‌కాల ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబుల నుండి మ‌నం త్వ‌ర‌గా ఉప‌శ‌మనాన్ని పొంద‌వ‌చ్చు. ద‌గ్గు, జ‌లుబును తగ్గించే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పొడి ద‌గ్గు ఇబ్బంది పెడుతున్న‌ప్పుడు కొద్దిగా వామును తీసుకుని దాన్ని చేత్తో న‌లిపి బుగ్గ‌న ఉంచుకోవాలి. దీని నుండి వ‌చ్చే ర‌సాన్ని మింగుతూ ఉండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ద‌గ్గు రాకుండా ఉండడంతో పాటు నిద్ర కూడా ప‌డుతుంది. ద‌గ్గు, జ‌లుబు ఇబ్బంది పెడుతున్న‌ప్పుడు దాల్చిన చెక్క పొడిని, తేనెతో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంది. జ‌లుబును త‌గ్గించ‌డంలో అల్లం చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. అల్లం ర‌సంలో కొద్దిగా నిమ్మ‌ర‌సాన్ని, తేనెను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల జ‌లుబు త‌గ్గు ముఖం ప‌డుతుంది. అంతేకాకుండా అల్లం ర‌సాన్ని ఈ విధంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.

Holy Basil Water can give many benefits make in this way
Holy Basil Water

జలుబు ఎక్కువ‌గా ఉండి ముక్కు రంధ్రాలు మూసుకుపోయిన‌ప్పుడు ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకుని కొద్దిగా ప‌సుపును, విక్స్ ను లేదా జండుబామ్ ను వేసి క‌లిపి ఆవిరి ప‌ట్టాలి. ఇఆ చేయ‌డం వ‌ల్ల జ‌లుబు నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక అందులో తుల‌సి ఆకుల‌ను వేసి మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ నీటిని గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ఫం తొల‌గిపోయి జ‌లుబు, ద‌గ్గు త‌గ్గుతుంది. అదే విధంగా అల్లంతో టీ ని చేసుకుని తాగ‌డం వ‌ల్ల కూడా జ‌లుబు, ద‌గ్గును త‌గ్గించుకోవ‌చ్చు. ఈ గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి.

నీళ్లు వేడాయ్య‌క క‌చ్చా ప‌చ్చ‌గా దంచిన అల్లాన్ని వేసి మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని వ‌డక‌ట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు త‌గ్గుతుంది. ద‌గ్గు తీవ్రంగా ఉన్న‌ప్పుడు మిరియాల పొడిలో తేనెను క‌లిని తీసుకోవ‌డం వ‌ల్ల ద‌గ్గు నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. జ‌లుబు, ద‌గ్గు ఎక్కువ‌గా బాధిస్తున్న‌ప్పుడు వేడి పాల‌ల్లో ప‌సుపును వేసి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల జలుబు, ద‌గ్గు నుండి స‌త్వ‌ర ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts