Cardamom Water : మనం వంటల్లో మసాలా దినుసుల్లో యాలకులు ఒకటి. ఇవి చక్కటి వాసనను కలిగి ఉంటాయి. వంటల్లో యాలకులను వాడడం వల్ల మనం చేసే వంటలు చక్కటి రుచి, వాసన పెరుగుతుంది. వంటల రుచిని పెంచడమే కాకుండా యాలకులు మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. యాలకుల వల్ల మనం ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉన్నాయి. యాలకుల్లో ఉండే పొటాషియం గుండె కొట్టుకోవడాన్ని క్రమబద్దీకరిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. యాలకుల్లో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్దకాన్ని తగ్గిస్తాయి.
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలల్లో యాలకుల పొడిని, చిటికెడు పసుపును, తేనెను కలిపి తాగడం వల్ల చక్కటి నిద్రను సొంతం చేసుకోవచ్చు. ఈ విధంగా పాలను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ చక్కగా పని చేస్తుంది. ఆకలి లేని వారు యాలకులను నమలడం వల్ల ఆకలి పెరుగుతుంది. యాలకులను నోట్లో వేసుకుని నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుర్లు ఆరోగ్యంగా ఉంటాయి. యాలకుల నుండి తీసిన నూనెను చర్మానికి రాసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదే విధంగా ఒక గ్లాస్ నీటిలో యాలకులను వేసి మరిగించాలి.
ఇలా మరిగించిన నీరు గోరు వెచ్చగా అయిన తరువాత ఆ నీటితో పుక్కిలించడం వల్ల గొంతునొప్పి తగ్గుతుంది.జుట్టును నల్లగా, ఒత్తుగా చేసే గుణం కూడా యాలకులకు ఉంది. జుట్టు రాలడం సమస్యతో బాధపడే వారు యాలకులను రోజూ తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. ప్రతిరోజూ రెండు లేదా నాలుగు యాలకులను తినడం వల్ల శరీరంలోని హానికారక మలినాలు తొలగిపోతాయి. యాలకుల్లో ఉండే క్యాల్షియం ఎముకలను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువును తగ్గించే శక్తి కూడా యాలకులకు ఉంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీటితో ఒక యాలక్కాయను తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగి బరువు తగ్గుతారు.
ఈ విధంగా క్రమం తప్పకుండా యాలక్కాయను గోరు వెచ్చని నీటితో తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గు ముఖం పడుతుంది. యాలకులు అన్ని అవయవాలను శుద్ధి చేసి ఆరోగ్యాన్ని కాపాడతాయి. మనం తీసుకునే ఆహారంలో చాలా పదార్థాలు జీర్ణం అవ్వక అసిడిటీ, మలబద్దకం,ఫైల్స్ వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి వారు గోరు వెచ్చని నీటితో యాలక్కాయను తీసుకోవడం వల్ల ఆయా సమస్యల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. యాలకులను ఉపయోగించి అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని వీటిని రోజూ వారి ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.