Home Made Biotin Powder : రోజూ ఈ పొడిని ఒక స్పూన్ తినండి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Home Made Biotin Powder : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో బ‌యోటిన్ కూడా ఒక‌టి. ఇది బి కాంప్లెక్స్ విట‌మిన్స్ లో ఒక‌టి. దీనినే విట‌మిన్ హెచ్ అని కూడా పిలుస్తారు. బ‌యోటిన్ మ‌న శరీరానికి చాలా అవ‌స‌రం. ఆమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్ల ఉప‌యోగంలో, చ‌ర్మాన్ని మ‌రియు జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో, జుట్టు రాల‌డాన్ని త‌గ్గించ‌డంలో, .జుట్టు కుదుళ్ల‌ను ధృడంగా చేయ‌డంలో, గోళ్ల‌ను అందంగా, ఆరోగ్యంగా ఉంచ‌డంలో, అంద‌మైన మ‌చ్చ‌లేని చ‌ర్మాన్ని అందించ‌డంలో బ‌యోటిన్ మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. ఇత‌ర పోష‌కాల వ‌లె బ‌యోటిన్ కూడా మ‌న శ‌రీరానికి చాలా అవ‌స‌రం. బ‌యోటిన్ లోపించ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల దుష్ప్రభావాల‌ను ఎద‌ర్కోవాల్సి ఉంటుంది. బ‌యోటిన్ లోపం కార‌ణంగా శ‌రీరంలో జీవ‌క్రియ‌లు నెమ్మ‌దిస్తాయి. చ‌ర్మం ఎర్ర‌బ‌డ‌డం, చ‌ర్మంపై పొట్టు లేవడం, దద్దుర్లు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అలాగే జుట్టు ఎక్కువ‌గా రాలిపోతుంది.

క‌నుక మన శ‌రీరంలో త‌గినంత బ‌యోటిన్ ఉండేలా చూసుకోవాలి. బ‌యోటిన్ లోపం రాకుండా ఉండాలంటే మ‌నం బ‌యోటిన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీని కోసం మ‌నం ఎక్కువ‌గా చేప‌లు, మాంసం, పోయాబీన్స్, ట‌మాటాలు, పాలు, గింజ‌లు, కూర‌గాయ‌లు వంటి వాటిని తీసుకోవాలి. అలాగే మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో బ‌యోటిన్ పౌడ‌ర్ ను త‌యారు చేసుకుని తీసుకోవాలి. ఈ రోజూ ఒక స్పూన్ మోతాదులో తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల బ‌యోటిన్ లోపం త‌గ్గ‌డంతో మ‌ర‌లా రాకుండా ఉంటుంది. అలాగే చ‌ర్మం మ‌రియు జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ బ‌యోటిన్ పౌడ‌ర్ ను ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Home Made Biotin Powder make like this take daily for hair and skin
Home Made Biotin Powder

ఈ పొడిని త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ముందుగా ఒక క‌ళాయిలో ఒక క‌ప్పు బాదం, ఒక క‌ప్పు వాల్ న‌ట్స్, అర క‌ప్పు జీడిప‌ప్పు, 2 టేబుల్ స్పూన్ల ప‌ల్లీలు, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్స్ చియా విత్త‌నాలు, అర క‌ప్పు అవిసె గింజ‌లు, ఒక క‌ప్పు గుమ్మ‌డి గింజ‌లు, అర క‌ప్పు పుచ్చకాయ గింజ‌లు వేసి చిన్న మంట‌పై దోర‌గా వేయించాలి. ఇవి చ‌ల్లారిన త‌రువాత జార్ లో వేసి మెత్త‌ని పొడిలాగా చేసుకోవాలి. త‌రువాత ఈ పొడిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బ‌యోటిన్ పౌడ‌ర్ త‌యార‌వుతుంది. బ‌యోటిన్ లోపంతో బాధ‌ప‌డే వారు ఈ లోపం రాకూడ‌దు అనుకునే వారు ఈ పొడిని రోజూ ఒక స్పూన్ మోతాదులో తీసుకోవాలి. పిల్ల‌లు కూడా ఈ పొడిని ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది.

D

Recent Posts