Chicken Fry : ఎప్పుడూ చేసిన‌ట్లు కాకుండా చికెన్ ఫ్రైని ఇలా కొత్త‌గా చేయండి.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

Chicken Fry : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌ర‌క‌ర‌కాల చికెన్ వెరైటీలు ల‌భిస్తూ ఉంటాయి. వాటిలో చికెన్ టిక్కా ఫ్రై కూడా ఒక‌టి. చికెన్ టిక్కా ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. స్టాట‌ర్ గా తిన‌డానికి, స్నాక్స్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. చాలా మంది ఈ టిక్కా ఫ్రైను ఇంట్లో త‌యారు చేసుకోవ‌డం వీలు కాదు అని భావిస్తూ ఉంటారు. కానీ చిన్న చిన్న చిట్కాల‌ను పాటిస్తూ కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల రెస్టారెంట్ ల‌లో ల‌భించే ఈ చికెన్ టిక్కాను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. రెస్టారెంట్ ల‌లో ల‌భించే ఈ చికెన్ టిక్కాను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ టిక్కా ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – పావుకిలో, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌, ఉప్పు – త‌గినంత‌, కాశ్మీరి చిల్లీ కారం – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి – అర‌ టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, బ‌ట‌ర్ – 2 టీ స్పూన్స్.

Chicken Fry make like this just once for good taste
Chicken Fry

చికెన్ టిక్కా ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో శుభ్రంగా క‌డిగి నీళ్లు లేకుండా చేసుకున్న చికెన్ ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, కారం, కాశ్మీరి చిల్లీ కారం, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ చికెన్ 20 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చికెన్ లో నీళ్లు ఊరుతాయి. ఇప్పుడు ఈ నీరు రాకుండా చికెన్ ముక్క‌ల‌ను మరో గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత బ‌ట‌ర్ త‌ప్ప మిగిలిన ప‌దార్థాలు వేసి చికెన్ కు ప‌ట్టేలా బాగా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత పాటు ఒక గంట‌పాటు మ్యారినేట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి.

బ‌ట‌ర్ క‌రిగిన త‌రువాత చికెన్ ముక్క‌ల‌ను ఒక్కొక్క‌టిగా వేసుకోవాలి. త‌రువాత ఈ చికెన్ ముక్క‌ల‌ను 4 నిమిషాల‌కొక‌సారి అటూ ఇటూ తిప్పుతూ వేయించుకోవాలి. మ‌ధ్య మ‌ధ్య‌లో కొద్ది కొద్దిగా బ‌ట‌ర్ ను కూడా వేసుకుంటూ ఉండాలి. ముక్క‌లు రెండు వైపులా చ‌క్క‌గా వేగి మెత్త‌గా అయిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ టిక్కా ఫ్రై త‌యార‌వుతుంది. ఈ విధంగా త‌యారు చేసిన చికెన్ టిక్కా ఫ్రైను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ తో త‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts