లవంగాలు మసాలా దినుసుల జాబితాకు చెందుతాయి. వీటిని వంటల్లో ఎక్కువగా వేస్తుంటారు. అయితే లవంగాల్లో అనేక ఔషధగుణాలు ఉండడం వల్ల వీటితో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. లవంగాలను తింటే జీర్ణవ్యవస్థ ఎంజైమ్‌లు విడుదల అవుతాయి. దీంతో జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా మలబద్దకం, వికారం సమస్యలు తగ్గుతాయి.
లవంగాల్లో ఉండే ఫైబర్, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగం ఉంటుంది. జలుబు సమస్య ఉన్న వారు లవంగాలను తింటుంటే ఆ సమస్య నుంచి వెంటనే బయట పడవచ్చు. లవంగాల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
లవంగాల్లో విటమిన్లు బి1, బి2, బి4, బి6, బి9, సి లతోపాటు బీటాకెరోటీన్, విటమిన్ కె, ప్రోటీన్లు ఉంటాయి. ఇవన్నీ మనల్ని వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల నుంచి సంరక్షిస్తాయి.
ఇక లవంగాల వల్ల పురుషులకు ఎంతగానో మేలు జరుగుతుంది. అనేక లైంగిక సమస్యలు తగ్గుతాయి. లవంగాల్లో కాల్షియం, ఐరన్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి మినరల్స్ ఉంటాయి. ఇవి పురుషుల్లో లైంగిక పటుత్వాన్ని పెంచుతాయి.
రోజూ ఉదయాన్నే పరగడుపునే 3 లవంగాలను అలాగే నమిలి తినాలి. దీంతో శృంగార జీవితం మెరుగు పడుతుంది. లవంగాలను తినడం వల్ల పురుషుల్లో వచ్చే అనేక సమస్యలు తగ్గుతాయి.
లవంగాలను తింటే వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అయితే లవంగాలను రోజుకు మూడు కన్నా ఎక్కువ తినరాదు. తింటే టెస్టోస్టిరాన్ హార్మోన్‌పై ప్రభావం పడుతుంది. కనుక రోజుకు మూడు లవంగాలను మాత్రమే తినాలి. ఇక పురుషులు ఉదయం పరగడుపున లవంగాలను తింటే శృంగార సమస్యలు తగ్గుతాయి. అదే రాత్రి నిద్రకు ముందు తింటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఇలా లవంగాలను భిన్న సమయాల్లో తినడం వల్ల భిన్న రకాల ప్రయోజనాలను పొందవచ్చు.