Pomegranate Juice : దానిమ్మ పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. మన శరీరానికి ఉపయోగపడే అనేక రకాల విటమిన్లు, మినరల్స్ దానిమ్మ పండ్లలో ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దానిమ్మ పండ్ల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.
దానిమ్మ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్ ను నాశనం చేస్తాయి. దీంతో కణాలు దెబ్బ తినకుండా సురక్షితంగా ఉంటాయి. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది.
దానిమ్మ పండ్లను తినడం వల్ల క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. అల్జీమర్స్ వ్యాధి రాకుండా ఉంటుంది. ఈ పండ్లను తింటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
దానిమ్మ పండ్లలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు శరీరంలోని నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. ఆర్థరైటిస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇక దానిమ్మ పండ్లను తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. బీపీ తగ్గుతుంది. అన్నింటి కన్నా ముఖ్యంగా వీటి జ్యూస్‌ను తాగితే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.
కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా ఉన్నవారు రోజూ ఒక గ్లాస్ దానిమ్మ పండ్ల జ్యూస్‌ను తాగాలి. ఇలా 40 రోజుల పాటు చేస్తే తప్పక ఫలితం కనిపిస్తుంది. దానిమ్మ పండ్ల జ్యూస్‌ను తాగడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. అందువల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉన్నవారు రోజూ దానిమ్మ పండ్ల జ్యూస్‌ను తాగితే మంచిది. దీంతో కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
అయితే దానిమ్మ పండ్ల జ్యూస్‌ను ప్యాక్ చేసింది కాదు, ఇంట్లో తయారు చేసుకుని తాగితేనే మంచిది. అందులో చక్కెర కలపకూడదు. దానిమ్మ పండ్ల విత్తనాలను బ్లెండర్‌లో వేసి జ్యూస్ తీసి అలాగే తాగేయాలి. ఆ జ్యూస్‌ను ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లేదా మధ్యాహ్నం లంచ్ తరువాత తాగవచ్చు. దీంతో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.