Urinate : మన శరీరంలో తయారయిన వ్యర్థ పదార్థాలు వివిధ మార్గాల ద్వారా బయటకు పోతాయి. కొన్ని రకాల వ్యర్థ పదార్థాలు మూత్ర విసర్జన ద్వారా బయటకు పోతాయి. మూత్రం గురించిన కొన్ని విషయాలను తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. సమయానికి మూత్ర విసర్ఝన చేయాలి. లేదంటే మనం అనారోగ్యాల బారిన పడక తప్పదు. మూత్ర విసర్జన అనేది చాలా ముఖ్యం. రోజుకు మూత్రవిసర్జన ఏడు సార్లు చేయాలి. ఏడు సార్ల కంటే తక్కువగా లేదా ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తే ఏదో తెలియని అనారోగ్యం మన శరీరంలో దాక్కొని ఉందని అర్థం.
అలాగే ఆరోగ్య వంతుల మూత్రవిసర్జన కాలం దాదాపు ఏడు సెకన్లు. ఏడు సెకన్ల కంటే తక్కువ సమయంలో మూత్ర విసర్జన జరిగితే వారికి ఏదో ఇన్ ఫెక్షన్ ఉందని అర్థం. మనం తీసుకునే ఆహారంలో శరీరంలో ఉండే పోషకాలను శరీరం గ్రహించి మిగిలిన పదార్థాలను మూత్రం, మలం రూపంలో విసర్జిస్తుంది. ఇక మూత్రం యొక్క రంగును చూసి కూడా మన ఆరోగ్యం గురించి చెప్పవచ్చు. మూత్రం తెల్లగా, స్వచ్ఛంగా ఉంటే శరీరానికి సరిపోయినన్ని నీరు తాగుతున్నారని అర్థం. మూత్రం ఎరుపు రంగులో ఉంటే మూత్రంలో రక్తం కలిసిందని అర్థం. ఇది చాలా సందర్భాల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ ఫెక్షన్ గా మారుతుంది.
మూత్రం ద్వారా ఎక్కువ మొత్తంలో రక్తం పోయినప్పటికీ దీనిని కూడా ఒక సమస్యగానే భావించాలి. అలాగే కొందరిలో మూత్రం నీలం రంగులో వస్తుంది. ఇది పసి పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని బ్లూ డైపర్ సిండ్రోమ్ అని అంటారు. ఇది ఒక జన్యు లోపం కారణంగా వచ్చే సమస్య. వయాగ్రా వాడే పురుషుల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అదే విధంగా కొన్ని రకాల ఫంగల్ ఇన్ ఫెక్షన్ ల వల్ల మూత్రం నలుపు రంగులో వస్తుంది. ఒక్కోసారి ఐరన్ లోపం కారణంగా కూడా మూత్రం నలుపు రంగులో ఉంటుంది.
మూత్రం కనుక జిగురు రంగులో వస్తే చర్మం లేదా గొంతు ఇన్ ఫెక్షన్ ల ప్రభావం మూత్ర పిండాల మీద పడిందని అర్థం. ఇలాంటి పరిస్థితి ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. యాంటీ బయాటిక్స్ వాడడం వల్ల మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. మూత్రం కనుక ముదురు పసుపు రంగులో ఉంటే డీహైడ్రేషన్ కు గురి అయినట్టు భావించాలి. కామెర్ల వంటి సమస్యలు ఉన్నా, కొన్ని రకాల మందులు వాడిన కూడా మూత్రం ముదురు పసుపు రంగులో వస్తుంది. అలాగే పెద్ద వారిలో మూత్రాశయం300 మిల్లీ లీటర్ల నుండి 500 మిల్లీ లీటర్ల వరకు మూత్రాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇక మూత్రం కనుక తియ్యటి వాసనను కలిగి ఉంటే మధుమేహం ఉందనడానికి సంకేతం. అందువల్ల మూత్ర విసర్జన సమయంలో అసహ్యం అనుకోకుండా మూత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి.