హెల్త్ టిప్స్

పురుషులు మూత్ర విస‌ర్జ‌న నిలబడి చేయాలా..? కూర్చొనా..? ఎలా చేస్తే మంచిది..?

మూత్రం.. మ‌న శ‌రీరంలోని ర‌క్తంలో ఉండే ప‌లు వ్య‌ర్థ ప‌దార్థాల మిశ్ర‌మం. దాన్నంత‌టినీ మూత్రం రూపంలో కిడ్నీలు వ‌డ‌బోస్తాయి. అలా విడుద‌లైన మూత్రం మూత్రాశ‌యంలోకి చేరుతుంది. అక్క‌డ మూత్రం నిండుతుంద‌న‌గానే మెదడు మూత్రానికి వెళ్లాల‌ని సిగ్న‌ల్ ఇస్తుంటుంది. ఈ క్ర‌మంలో మ‌నం మూత్రానికి వెళ్తాం. అయితే మూత్ర విస‌ర్జ‌న విష‌యానికి వ‌స్తే పురుషులు, స్త్రీలు భిన్న ర‌కాలుగా చేస్తారు. స్త్రీలు కూర్చుని మూత్ర విస‌ర్జ‌న చేస్తే పురుషులు నిల‌బ‌డి చేస్తారు. కొంద‌రు పురుషులు కూడా కూర్చునే మూత్ర విస‌ర్జ‌న చేస్తారు. అది వేరే విషయం. కానీ మీకు తెలుసా..? పురుషులు నిల‌బ‌డి కాక, కూర్చుని మూత్ర విసర్జ‌న చేస్తే దాంతో ఎంతో ఉపయోగం ఉంటుంద‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న పురుషుల్లో మూడింట ఒక వంతు మంది కూర్చునే మూత్ర విస‌ర్జ‌న చేస్తార‌ట. ఈ క్ర‌మంలో అలా మూత్ర విస‌ర్జ‌న చేసే వారిలో చాలా మంది ఆరోగ్య‌వంత‌మైన జీవితం గ‌డుపుతున్నార‌ట‌. అనేక మందికి మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు లేవ‌ట‌. అంతెందుకు, ఒక‌ప్పుడు మ‌న తాత‌లు, ముత్తాత‌లు చాలా వ‌ర‌కు కూర్చునే మూత్ర విస‌ర్జ‌న చేసే వారు గ‌మ‌నించారా..? ఆ.. అవును, కానీ ఇప్పుడు అధిక శాతం మంది నిల‌బ‌డే మూత్ర విస‌ర్జ‌న చేస్తున్నారు. అయితే ఇలా కంటే కూర్చుని మూత్ర విస‌ర్జ‌న చేస్తేనే మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ట‌. అవేమిటంటే..

how men have to urinate

సాధార‌ణంగా మూత్రంలో ఉండేవ‌న్నీ వ్య‌ర్థ ప‌దార్థాలే. ఈ క్ర‌మంలో వ్యాధిగ్ర‌స్తుల నుంచి వ‌చ్చే మూత్రంలో ఒక్కోసారి బాక్టీరియా కూడా ఉంటుంది. దీంతో వారు నిలుచుని మూత్ర విసర్జ‌న చేస్తే దాంతో ఆ బాక్టీరియా అంతా బాగా వెద‌జ‌ల్లిన‌ట్టు అవుతుంది. అలా వెద‌జ‌ల్లిన‌ట్టు ప‌డే బాక్టీరియా ఇత‌రుల శ‌రీరాల్లోకి సుల‌భంగా ప్ర‌వేశిస్తుంద‌ట‌. అందుకే కూర్చుని మూత్ర విస‌ర్జ‌న చేస్తే బాక్టీరియా అంతా ఒకే దగ్గ‌ర ఉండి అంత‌టా విస్త‌రించ‌దు. కూర్చుని మూత్ర విస‌ర్జ‌న చేయ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో శుభ్ర‌త‌ను అందించిన‌ట్టు అవుతుంద‌ట‌.

మూత్రాశ‌య‌, శృంగార‌ సంబంధ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కూర్చుని మూత్ర విస‌ర్జ‌న చేస్తే దాంతో ఆయా స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌ట్టేందుకు ఎక్కువ‌గా అవకాశం ఉంటుందట‌. కూర్చుని మూత్ర విస‌ర్జ‌న చేస్తే మూత్రాశ‌యం నుంచి మూత్రం పూర్తిగా బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ట‌. ఇది కిడ్నీ స్టోన్స్‌, మూత్రాశ‌య స‌మ‌స్య‌లు ఉన్న వారికి ఎంతో మేలు చేస్తుంద‌ట‌. క‌నుక పురుషులు ఎవ‌రైనా స‌రే నిలుచునే కంటే కూర్చుని మూత్ర విస‌ర్జ‌న చేస్తేనే ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts