హెల్త్ టిప్స్

Weight Gain : స్పీడ్‌గా కండ ప‌ట్టాలంటే.. ఇలా చేయండి..!

Weight Gain : బరువు తక్కువగా ఉన్నవాళ్లు, బాగా సన్నగా ఉన్న వాళ్ళు కొన్ని ఆహార పదార్థాల‌ని తీసుకుంటూ ఉంటారు. వీటిని తీసుకోవడం వలన బలంగా మారవ‌చ్చని, కండ పడుతుందని అంటుంటారు. అయితే నిజంగా కండ పట్టాలంటే వీటిని కచ్చితంగా తీసుకోండి. అప్పుడు సులభంగా బరువు పెరగొచ్చు. ఒళ్ళు వస్తుంది. బరువు పెరగాలంటే కచ్చితంగా వీటిని పాటించండి. మొలకలతోపాటుగా నానబెట్టిన పల్లీలను కూడా తీసుకోండి.

ఉదయాన్నే ఈ రెండింటినీ తీసుకోవడం వలన బరువు పెరగడానికి అవుతుంది. కండ కూడా త్వరగా పడుతుంది. వేరుశనగల‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తీసుకోవడం మంచిది. మాంసం కంటే కూడా వేరుశనగల‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కచ్చితంగా తీసుకోవడం మంచిది. ఏదైనా పండు కానీ ఖర్జూరాన్ని కానీ వీటితోపాటుగా తీసుకోండి.

how to gain weight quickly

అరటిపండు లేదంటే సపోటా లాంటి పండ్లను మీరు తీసుకోవచ్చు. ఉదయం 8 గంటల లోపు మీరు అల్పాహారం సమయంలో వీటన్నింటినీ తీసుకోండి. భోజనం సమయంలో మీరు ముడి బియ్యాన్ని తీసుకోండి. పాలిష్ బియ్యం వద్దు. భోజనంలో 60 శాతం అన్నం, 40 శాతం కూరలు పెట్టుకుని తీసుకోవాలి. తెలగపిండితో చేసిన కూరలను మీరు తీసుకుంటే మంచిది. అలానే కందిపప్పు, పెసరపప్పు వంటివి కూడా మీరు కూరల్లో వాడుకోండి.

మీ బరువుని ఇవి బాగా పెంచుతాయి. కాబట్టి క‌చ్చితంగా తీసుకుంటూ ఉండండి. రాత్రిపూట మాత్రం రోటీ వంటివి తీసుకోవద్దు. డిన్నర్ లో మీరు ఒక పెద్ద కొబ్బరి చెక్క దానితో పాటుగా డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ ని మీరు ఉదయం నానబెట్టుకుని రాత్రి తీసుకుంటే మంచిది. దానితో పాటుగా మీరు పండ్లు, ఎండు ఖర్జూరం వంటివి కూడా తీసుకోండి. ఇవన్నీ తీసుకుంటే, సులభంగా మీరు రెండు మూడు కేజీలు పెరుగుతారు. అలానే మోషన్ కూడా ఫ్రీగా అయ్యేటట్టు చూసుకోండి. ఇలా ఈ చిట్కాలను పాటిస్తే ఈజీగా కండ పడుతుంది.

Admin

Recent Posts