హెల్త్ టిప్స్

ఇడ్లీ, దోశ‌ ఎక్కువగా తింటే వచ్చే ఆరోగ్య సమస్యలేమిటి ?

చెప్పుకోడానికి ఇడ్లీ, దోశ వంటి టిఫిన్లు ఆరోగ్య కరమైన వే అనిపిస్తాయి గానీ, మరీ ప్రతి రోజూ అవే తింటే కొంత కాలానికి హాని చేస్తాయి, ఎలా గంటే… ఇడ్లీ తయారీకి ఒక్క కప్పు మినప గుళ్ళు వేస్తే, వాటిల్లో రెండున్నర కి మించి బియ్యం రవ్వ పోస్తారు, హోటళ్ల వారైతే 8–10 రెట్లు ఉప్పుడు రవ్వ పోసి పిండి రుబ్బి పులియ బెడ తారు, మంచి రుచి వస్తుంది, అయితే మినప పప్పు అంటే ప్రోటీన్లు, బియ్యం రవ్వ అంటే కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థం, ఈ రెండూ కాంబినేషన్లో ఉదయం బ్రేక్ fast చేస్తే నష్టం ఏమీ ఉండదు, కానీ ప్రోటీన్స్ కంటే కారోహైడ్రెట్స్ అధిక మై, ఇడ్లీలు తిన్న వెంటనే గంట లోపే గ్లూకోజు గా మారి ఒక్కసారిగా రక్తం లోకి దూకుతుంది.

పైగా పాలిష్ చేసిన బియ్యం రవ్వ ని empty carbohydrates అంటారు , అంటే ఇత రత్రా పోషకాలు ఏమీ లేకుండా వట్టి carbs మాత్రమే మిగిలిన గింజలు! వీటితో తయారైన ఇడ్లీలు తిన్నపుడు అవి త్వరగా అరిగి పోయి వెంటనే ఆకలి వేసే స్వభావం ఉంటుంది! ఈ break fast ఏళ్ళ తరబడి కొనసాగితే శరీరంలో పోగు పడిన అదనపు చక్కెర క్రమేణా fat గా మారి స్థూల కాయానికి దారి తీయవచ్చు, అంటే అధిక బరువు అన్న మాట, ఇక over weight వల్ల జరిగే నష్టాలు అన్నీ ఇన్నీ కావు! ధాన్యం గింజలు అన్నింటిలోకీ అధిక కేలరీలు, గ్లూకోజు ఉండే గింజలు వరి! కాబట్టి ప్రతి రోజూ ఇడ్లీలు కాకుండా వారానికి ఒక్క సారి తింటే మేలు, ఇడ్లీలు తినడం తప్పదు అనుకుంటే బియ్యం రవ్వకు బదులు జొన్నలు రాగులు అరిగెలు కొర్రలు వంటి చిరు ధాన్యాలరవ్వలు బెటర్, అంతగా హాని ఉండదు!

idly and dosa regular eating side effects

ముడి గింజలతో పదార్థాలు చేసుకుని తింటే అవి అరగవు, ఆకలి మందగిస్తుంది అని కొందరు అపోహ పడుతుంటారు, అలా అరక్క పోవడం ఏమీ ఉండదు, చాలా స్లో గా రక్తంలోకి గ్లూకోజు పంపడం వల్ల అలా అనిపిస్తుంది, కార్బో హైడ్రేట్స్ మినహా ఏమీ ఉండని polished తెల్ల గింజలు తో చేసినవి తింటే యమా స్పీడుతో జీర్ణమై తరవాత ఏమి తినాలా? అని సిద్ధమై పోతాం , ఇది మంచిది కాదు! పైగా refined ఇడ్లీ రవ్వ లో ఫైబర్ అనగా పీచు పదార్థం నామినల్ గా ఉంటుంది, దీని వల్ల మల పదార్థం తగినంత తయారవక constipation అనగా మ ల బద్ధకం ఏర్పడుతుంది, అవిరి మిద ఉడికించడం వరకూ మంచిదే, కానీ ఇతర త్రా సమస్యలు వస్తాయి! పాలిష్ పట్టిన తెల్ల బియ్యం వాడకం ఎక్కువ కాబట్టే దక్షిణ భారతంలో డయాబెటిస్ వారు అధికంగా ఉన్నారని పరిశోధనలు తెలిపాయి, North India లో అంతగా షుగర్ వ్యాధి గ్రస్తుల సంఖ్య కనబడదు, ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, తమిళ నాడులో బియ్యంతో వండ ని దే రోజు గడవదు!,,,

హైదరబాద్ నగరంలో 30 లక్షలకు మించి డయాబెటీస్ వారు ఉన్నారని Health surveys చెబుతున్నాయి, అంటే మొత్తం జనాభాలో మూడో వంతు అన్న మాట, హైదరాబాద్ నగరం దేశానికి రెండో రాజధాని మాట ఏమో గానీ…షుగర్ / Diabetic capital అని పేరు వచ్చేసింది, ప్రతి మూడో వ్యక్తికీ సుగర్ ఉంటోంది అని తేలింది! దోసెలు విషయం కూడా అంతే, ప్రతి రోజూ ఇడ్లీ దోశ ఉప్మా మైసూరు బోండా పూ రీలు అని కాకుండా మిల్లెట్స్, ఓట్స్ , sweet corn, పూర్తిగా మినుము, పెసలు, శనగలు తో చేసిన టిఫిన్స్ తింటే ఆరోగ్యం మరియు రోజంతా ఎనర్జీ వస్తుంది, చిన్న వయసులోనే బీపీ షుగర్ obesity వంటి వాటి బారిన పడకుండా ఉంటారు, ఒక వేళ ఉంటే అదుపు చేసుకున్న వారవుతారు!

Admin