పూజలు చేసినప్పుడు హిందువులు అగర్ బత్తీలు కచ్చితంగా వెలిగిస్తారు. ఏ దేవున్ని, దేవతను పూజించినా ఇవి కచ్చితంగా వెలగాల్సిందే. పలు ఇతర మతాల్లోనూ అగర్ బత్తీలను వెలిగించే సాంప్రదాయం ఉంది. అయితే ఎవరు, ఎలా అగర్ బత్తీలను వెలిగించినా… వాటిని వెలిగించడం వెనుక మాత్రం సైంటిఫిక్ రీజన్స్ కొన్ని దాగి ఉన్నాయి. అవేమిటో, వాటి వల్ల మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడంటే రకరకాల సువాసనలతో అగర్‌బత్తీలను తయారు చేస్తున్నారు కానీ ఒకప్పుడు అగర్‌బత్తీలను లోబన్, గుగ్గుల్ అనే పదార్థాలను ఉపయోగించి తయారు చేసే వారు. అయితే అలా ఈ పదార్థాలతో అగర్‌బత్తీలను తయారు చేయడం వల్ల వాటిని మండించినప్పుడు వచ్చే పొగలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఈ క్రమంలో ఆ పొగను పీలిస్తే మన మెదడుకు రిలాక్సేషన్ కలుగుతుంది.
అగర్‌బత్తీల నుంచి విడుదలయ్యే పొగను పీల్చడం వల్ల మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. ఆందోళన, ఒత్తిడి వంటివి తగ్గిపోతాయి. అగర్‌బత్తీల పొగలో యాంటీ సెప్టిక్, యాస్ట్రిజెంట్ గుణాలు ఉంటాయి. అందువల్ల అవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్లను నయం చేస్తాయి. అగర్‌బత్తీలను వెలిగించడం వల్ల వాటి పరిసరాల్లో ఉండే గాలి శుభ్రమవుతుంది. పరిశుభ్రమైన, స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది. దీంతో గాలి కాలుష్యం ఉండదు. అగర్‌బత్తీల పొగను పీలిస్తే వాటిలో ఉండే ఔషధ గుణాలు ఏకాగ్రతను, పట్టుదలను పెంచుతాయి. ఇది విద్యార్థులకు ఎంతానో మేలు చేసే అంశం. దీంతో వారు ఏకాగ్రతతో చదివి చదువుల్లో రాణించగలుగుతారు.
వాస్తు ప్రకారం అగర్‌బత్తీలను వెలిగించడం ఎంతగానో మేలు చేస్తుందట. దీని వల్ల ఇంట్లో అంతా నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. అయితే ఇటీవలి కాలంలో వస్తున్న అగర్ బత్తీల్లో ఎక్కువగా రసాయనాలు కలుస్తున్నాయట. అందుకని వాటిని కొనుగోలు చేసే ముందు వాటిలో కలిసే పదార్థాల గురించి ఓ సారి తెలుసుకోవడం మంచిది. లేదంటే అగర్‌బత్తీల నుంచి వెలువడే పొగలో ఉండే విష రసాయనాలను పీల్చాల్సి వస్తుంది. అప్పుడు పైన చెప్పిన ఫలితాలు కాకుండా అనారోగ్య ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది.