Mint Tea : ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రస్తుతం చాలా మంది అనేక రకాల మార్గాలను అనుసరిస్తున్నారు. వాటిల్లో హెర్బల్ టీలను తాగడం కూడా ఒకటి. మనకు అనేక రకాల హెర్బల్ టీలు అందుబాటులో ఉన్నాయి. అయితే కొందరు ఇంట్లోనే వీటిని తయారు చేసుకుని తాగుతుంటారు. పుదీనా, కొత్తిమీర వంటి వాటితో హెర్బల్ టీలను తయారు చేయవచ్చు. అయితే ఇవి మనకు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ అందరికీ ఇవి పడవు. అందువల్ల ఈ టీ లు పడని వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పుదీనా టీని అధిక మోతాదులో తాగితే అనేక సమస్యల బారిన పడాల్సి వస్తుంది.
పుదీనా టీ లో కెఫీన్ ఉండదు. అందువల్ల ఇది ఆరోగ్యకరమైనదే. అయితే అతిగా తాగడం వల్ల సమస్యలు వస్తాయి. పుదీనా టీ తాగితే జలుబు, దగ్గు, ముక్కు కారడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ టీని అధిక మోతాదులో తాగితే దుష్ప్రభావాలు కలుగుతాయి. పుదీనా టీని తాగితే షుగర్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి. కానీ షుగర్ మరీ తక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక ఎప్పటికప్పుడు షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే షుగర్ మరీ తక్కువై ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.
ఇక కొందరికి ఫుడ్ అలర్జీలు ఉంటాయి. అలాంటి వారు పుదీనా టీని తాగరాదు. పుదీనా టీని తాగితే కొందరికి తలనొప్పి, కాళ్లు తేలిపోయినట్లు ఉండడం, నోట్లో పుండ్లు వంటివి వస్తాయి. ఇలా జరిగితే కచ్చితంగా పుదీనా టీని తాగరాదు. దీన్ని తాగడం ఆపేయాలి. లేదంటే సమస్యలు ఎక్కువవుతాయి. అయితే ఎలాంటి అలర్జీ లేని వారు మాత్రం పుదీనా టీని తాగవచ్చు. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందుతారు.