Prawns Pakoda : రొయ్య‌ల ప‌కోడీలు.. ఇలా చేశారంటే.. మొత్తం తినేస్తారు..

Prawns Pakoda : రొయ్య‌ల‌తో స‌హ‌జంగానే చాలా మంది అనేక ర‌కాల వంట‌ల‌ను చేస్తుంటారు. ఇవి ఎలా వండినా స‌రే చాలా రుచిగా ఉంటాయి. అలాగే పోష‌కాలు అధికంగా ఉంటాయి క‌నుక రొయ్య‌ల‌ను తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు. అయితే రొయ్య‌ల‌తో ఎంతో రుచిక‌రంగా ఉండే ప‌కోడీల‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. వీటిని త‌యారు చేసేందుకు పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌దు. శ్ర‌మించాల్సిన ప‌ని కూడా లేదు. వీటిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Prawns Pakoda very easy to make recipe is here
Prawns Pakoda

రొయ్య‌ల ప‌కోడీల‌ త‌యారీకి కావాల్సిన ప‌దార్ధాలు..

రొయ్యలు – అర కిలో, శనగపిండి – 1 కప్పు, ఉల్లి తరుగు – కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు – 1 టీ స్పూను, వంటసోడా – చిటికెడు, ఉప్పు – రుచికి తగినంత, కారం – అర టీ స్పూను, చాట్‌ మసాలా – అర టీ స్పూను, నూనె – వేగించడానికి సరిపడా, పచ్చిమిర్చి – 2, గరం మసాలా – పావు టీ స్పూను, కరివేపాకు – గుప్పెడు, కొత్తిమీర తరుగు – 1 టేబుల్‌స్పూను.

రొయ్య‌ల ప‌కోడీల తయారీ విధానం..

ముందుగా ఒక పాత్ర‌లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ‌లు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, గరం మసాలా, వంటసోడా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, శనగపిండితోపాటు రొయ్యల‌ను ఒక పాత్రలో వేసి అవసరమైతే కొద్దిగా నీరు చల్లుకుని బాగా కలిపి అరగంట పక్కన పెట్ట‌కోవాలి. ఆ తర్వాత నూనెలో పకోడీల్లా వేస్తూ గోల్డెన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేగించాలి. బాగా వేగాక చాట్‌ మసాలా చల్లితే స‌రిపోతుంది. అంతే.. ఎంతో టేస్టీ టేస్టీ రొయ్య‌ల ప‌కోడీ రెడీ. రొయ్య‌ల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు రొయ్య‌లు తీసుకోవ‌డం చాలా మంచిది. మ‌న శ‌రీరానికి కావాల్సిన అనేక ర‌కాలు పోష‌కాలు ల‌భిస్తాయి. ఈ ప‌కోడీల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
Editor

Recent Posts