టీ, కాఫీలు తాగుతున్నారా ? అయితే ఈ విషయాల‌ను తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు..!

చాలా మందికి ఉద‌యం లేవ‌గానే టీ, కాఫీల‌ను తాగ‌నిదే రోజూ గ‌డిచిన‌ట్టు ఉండ‌దు. కొన్ని అధ్య‌య‌నాల ప్ర‌కారం నీటి త‌రువాత చాలా మంది ఇష్ట‌ప‌డే పానీయం టీ అని తెలుస్తోంది. అంత‌గా టీ, కాఫీలు మ‌న జీవితంతో పెన‌వేసుకుపోయాయి. అయితే టీ, కాఫీల‌ను తాగ‌డం వ‌ల్ల ఎన్నో అన‌ర్థాలు వ‌స్తాయ‌ని, వీటిని తాగ‌డం మంచిది కాద‌ని అన‌డం మ‌నే వినే ఉంటాం. టీ, కాఫీల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు లాభ‌మా.. న‌ష్ట‌మా.. టీ మంచిదా లేదా కాఫీ మంచిదా వంటి విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఏదైనా మోతాదులో తీసుకుంటే ఎటువంటి ప్ర‌మాదం ఉండ‌దు. మోతాదుకు మించి తీసుకుంటేనే స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. ఇది టీ, కాఫీల విష‌యంలోనూ వ‌ర్తిస్తుంది. టీ, కాఫీలను తాగ‌డం వ‌ల్ల క‌లిగే లాభాల గురించి తెలుసుకుందాం. టీ తేయాకు నుండి ల‌భించే స‌హ‌జసిద్ధ‌మైన‌ పానీయం. దీనిలో ముఖ్యంగా బి గ్రూప్ విట‌మిన్లు, నియాసిన్, రైబో ఫ్లేవిన్ వంటి పోష‌కాలు ఉంటాయి. టీ లో అతి త‌క్కువ‌గా ఉండే కెఫీన్ మ‌న‌సు ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉండేలా స‌హాయ‌ప‌డుతుంది. బ‌ద్ద‌కంగా ఉన్న‌ప్పుడు టీ ని తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఉత్తేజం క‌లుగుతుంది. టీ తాగ‌డం వల్ల శ‌రీరంలో అధికంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది. టీ తాగ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు కూడా రాకుండా ఉంటుంది.

if you are drinking tea and coffee daily then you should know these first

క్యాన్స‌ర్ కార‌కాల‌తో పోరాడే శ‌క్తి కూడా టీ కి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీల‌లో రొమ్ము క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాల‌ను టీ త‌గ్గిస్తుందని శాస్త్ర‌వేత్త‌లు తెలియ‌జేస్తున్నారు. మోతాదుకు మించి టీ, కాఫీ ల‌ను తాగ‌డం వ‌ల్ల క‌లిగే అన‌ర్థాల గురించి తెలుసుకుందాం. టీ లో ఉండే కెఫీన్ వల్ల గుండె సంబంధిత స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. రోజులో ఎక్కువ సార్లు టీ ని తాగ‌డం వ‌ల్ల దీనిలో ఉండే కెఫీన్ శ‌రీరంలోకి చేరి గుండె ప‌ని తీరుపై ఫ్ర‌భావం చూపిస్తుంది. టీ ని ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల నిద్ర‌లేమి స‌మ‌స్యతోపాటు మాన‌సిక స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి.

ఇలా అని టీ తాగ‌డాన్ని ఒక్క‌సారిగా మానేస్తే నీర‌సం, త‌ల‌నొప్పి, ఏకాగ్ర‌త లోపించ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అందుకే టీ ని త‌క్కువ మోతాదులో తీసుకోవ‌డం అల‌వాటు చేసుకోవాలి. టీ ఎక్కువ‌గా తాగే పురుషుల‌కు ప్రోస్టేట్ క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. టీ లో ఉండే ర‌సాయ‌నాలు జీర్ణవ్య‌వ‌స్థ ప‌నితీరుపై కూడా ఫ్ర‌భావాన్ని చూపిస్తాయి. టీ ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్, అసిడిటీ వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంటుంది. గ‌ర్భిణీలు టీ, కాఫీ ల‌ను తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది. స్త్రీల‌కు ఆరోగ్యప‌రంగా చూస్తే టీ కి బ‌దులుగా కాఫీ తాగ‌డమే మంచిద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

Share
Admin

Recent Posts