Egg : చౌక ధరలో అందరికీ అందుబాటులో ఉండే పౌష్టికాహారం.. కోడి గుడ్డు. చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కోడి గుడ్డు ఎంతో సహాయపడుతుంది. గుడ్డును తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. గుడ్డును తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్డును తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. గుడ్డులో కెరటనాయిడ్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల కంటి సమస్యలు తగ్గుతాయి.
చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలోనూ కోడిగుడ్లు ఎంతో సహాయపడతాయి. గుడ్డును ఫేస్ ప్యాక్ గా కూడా వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది. చర్మంపై ముడతలను తొలగించి యవ్వనంగా కనిపించేలా చేయడంలోనూ గుడ్డు ఉపయోగపడుతుంది. అంతే కాకుండా గుడ్డును ఆహారంగా తీసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. గుడ్డులో ఉండే ప్రోటీన్లు బరువు పెరగకుండా చేయడంలో సహాయపడతాయి. రోజూ గుడ్డును తినడం వల్ల బరువు పెరుగుతారనేది.. అపోహేనని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు కూడా గుడ్డును ఆహారంగా తీసుకోవచ్చు.
ప్రతిరోజూ గుడ్డును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మెదడు చురుకుగా ఉంటుంది. ఎముకలు ధృడంగా మారుతాయి. గుడ్డును ఉడక బెట్టి తీసుకోవడం వల్ల మాత్రమే మనకు ఈ ప్రయోజనాలు కలుగుతాయి. గుడ్డును పూర్తిగా ఉడికించడానికి 13 నిమిషాల పమయం పడుతుంది. గుడ్డు పచ్చ సొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందని దీనిని చాలా మంది తినరు. కానీ పచ్చ సొనను మితంగా తీసుకోవడం వల్ల ఎటువంటి హాని కలగదని నిపుణులు చెబుతున్నారు.
ఉదయం పూట గుడ్డును అల్పాహారంలో భాగంగా చేసుకోవడం వల్ల చాలా సమయం వరకు ఆకలి అవ్వకుండా ఉంటుంది. విటమిన్ డి గుడ్డులో అధికంగా ఉంటుంది. విటమిన్ డి లోపంతో బాధపడే వారు గుడ్డును ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయట పడవచ్చు. కొందరు వేసవి కాలంలో గుడ్డును తినడం వల్ల శరీరంలో వేడి చేస్తుందని తినకుండా ఉంటారు. కానీ ఇది వాస్తవం కాదని నిపుణులుచెబుతున్నారు. ఈ సీజన్‌లోనూ నిరభ్యంతరంగా గుడ్డును తినవచ్చు.
గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేయడంలో కూడా గుడ్డు ఎంతో సహాయపడుతుంది. పిల్లల ఎదుగుదలకు గుడ్డు దోహదపడుతుంది. ఎలాంటి శరీరతత్వం కలిగిన వారైనా సరే గుడ్డును తినవచ్చు. గుడ్డును ప్రతిరోజూ ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం. కనుక కోడిగుడ్డును తినడంలో ఉండే అపోహలను వీడి తరచూ వీటిని తింటుంటే అనేక పోషకాలను, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.