హెల్త్ టిప్స్

రాత్రిళ్ళు నిద్రపట్టట్లేదా..? అయితే ఈ తప్పులు చేయకండి..!

రాత్రిపూట మీకు నిద్ర పట్టట్లేదా? రాత్రిపూట నిద్ర పట్టాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. రాత్రిపూట బాగా నిద్ర పట్టాలంటే వీటిని ఫాలో అవ్వండి. నిద్ర బాగుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. రాత్రిపూట నిద్రపోవడానికి కెఫిన్ కి మధ్య నాలుగు నుంచి ఐదు గంటల సమయం ఉండేటట్టు చూసుకోండి. కెఫిన్ ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. అలాగే ఆల్కహాల్ కి కూడా దూరంగా ఉండాలి. రాత్రి బాగా నిద్ర పట్టడానికి పుదీనా టీ ని తీసుకోండి.

అలాగే తలకు ఆవాలు నూనెను పట్టించి ఆవాల నూనెతో కాసేపు మసాజ్ చేయడం వలన మంచి నిద్రని పొందడానికి అవుతుంది. ఆవాల నూనెను మీరు మీ పాదాలకి రాసుకుని కాసేపు మర్దన చేస్తే కూడా మాంఛి నిద్రని పొందడానికి అవుతుంది. రాత్రిపూట ఆలస్యంగా తినడం, హెవీగా తినడం కూడా మానుకోండి. రాత్రిపూట మాంఛి నిద్రని పొందడానికి లైట్ గా తీసుకోవడం, నిద్రపోవడానికి రెండు మూడు గంటలు ముందే ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోండి.

if you are not getting sleep at night then do not do these mistakes

రాత్రిలో నిద్రపోవడానికి పొందడానికి స్క్రీన్స్ కి దూరంగా ఉండండి. టీవీ, ఫోన్స్, లాప్టాప్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే మీరు నిద్రపోయే గది బాగుండేటట్టు చూసుకోండి. గాలి కలిగే విధంగా, చీకటిగా ఉండే విధంగా చూసుకోండి. ఎక్కువ లైట్ల వలన కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది.

Share
Peddinti Sravya

Recent Posts