హెల్త్ టిప్స్

Eggs In Fridge : ఫ్రిజ్‌లో నిల్వ చేసిన గుడ్ల‌ను తింటున్నారా.. అయితే ముందు ఇది చ‌ద‌వండి..!

Eggs In Fridge : సాధార‌ణంగా చాలా మంది రోజూ వివిధ ర‌కాల కూర‌ల‌ను చేసుకుని తింటుంటారు. అయితే ఏం కూర చేయాలో తోచ‌న‌ప్పుడు నాలుగు కోడిగుడ్ల‌ను ప‌గ‌ల‌గొట్టి ఎగ్ ఫ్రై లేటా ఎగ్ ట‌మాటా వంటివి చేసి తింటారు. ఎందుకంటే ఈ కూర‌లు రుచిగా ఉండ‌డ‌మే కాదు.. త్వ‌ర‌గా చేసుకోవ‌చ్చు కూడా. అందుక‌నే బ్యాచిల‌ర్స్ ఎప్పుడూ కోడిగుడ్డు కూర‌ల వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే కోడిగుడ్ల‌ను తెచ్చుకుని వండి తింటాం. కానీ వాటిని నిల్వ చేసే విష‌యంలోనే ప‌లు ముఖ్య‌మైన సూచ‌న‌ల‌ను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కోడిగుడ్ల‌ను తెచ్చిన‌ప్పుడు ఎవ‌రైనా స‌రే డ‌జ‌ను లేదా అంత‌కు పైగానే తెస్తారు. అయితే ఇది బాగానే ఉంటుంది. కానీ వాటిని కొంద‌రు ఫ్రిజ్‌ల‌లో పెడ‌తారు. ఇదే చేయకూడ‌ద‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. కోడిగుడ్ల‌ను అస‌లు ఫ్రిజ్‌లో పెట్ట‌కూడ‌ద‌ట‌. పెడితే ఏం జ‌రుగుతుంది.. అలాంటి గుడ్ల‌ను తిన‌వ‌చ్చా.. అన్న ప్ర‌శ్న‌ల‌కు నిపుణులు ప‌లు స‌మాధానాలు చెబుతున్నారు. అవేమిటంటే..

if you are storing eggs in fridge then must know this

ఫ్రిజ్‌లో నిల్వ చేసిన గుడ్లను తినటం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుడ్లకు శీతలీకరణ అవసరంలేదు. వీటిని బయటి వాతావరణంలో ఉంచినా బాగానే ఉంటాయి. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న గుడ్లను తినడమే మంచిది. బయటి వాతావరణంలో ఉంచిన గుడ్లతో పోలిస్తే ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్లు త్వరగా కుళ్లిపోతాయి. ఫ్రిజ్‌ లో ఉంచిన గుడ్లను బయటకు తీసిన తర్వాత వాటి రుచిలో తేడా వస్తుంది. పుల్లగా అనిపిస్తాయి.

పెంకుపై ఉండే బాక్టీరియా బయట ఉన్న గుడ్లపై పోల్చితే ఫ్రిజ్‌లో ఉంచిన కోడిగుడ్లపై ఎక్కువగా ఉంటుంది. అందువ‌ల్ల ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్ల‌ను తిన‌డం ఏమాత్రం శ్రేయ‌స్క‌రం రాదు. ఎల్లప్పుడూ కోడిగుడ్ల‌ను బ‌య‌టే నిల్వ చేయాలి. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్ల‌ను తిన‌రాదు. క‌నుక ఇక‌పై గుడ్ల విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం మ‌రిచిపోకండి. లేదంటే అనారోగ్యాల‌ను కొని తెచ్చుకున్న వార‌వుతారు.

Admin

Recent Posts