ఒక బైక్ పై వెళుతున్న భార్యా భర్తలు సడన్ గా రాత్రి సింహాన్ని చూసి షాక్ అయ్యారు. గుజరాత్ సోమనాథ్ లో ఇది చోటు చేసుకుంది. అక్టోబర్ ఆరవ తేదీన 11 గంటలకు రాత్రి రామ మందిరానికి సమీపంలో ఉన్న నవబంధారు గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ముందు వాళ్ళు వీధి కుక్క అనుకున్నారు. తీరా చూస్తే అది సింహం అని అర్థమైంది.
వెంటనే భయానికి గురయ్యారు. సింహాన్ని చూసి ఒక్క సారిగా షాక్ అయ్యారు. దీనితో ఒక్కసారిగా బైక్ పై నుంచి జంప్ చేసి పరుగులు తీసారు. అక్కడ ఒక సీసీ కెమెరాలో ఇదంతా కూడా రికార్డు అయ్యి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
సింహం చాలా కోపంగా కనబడుతోంది. వాళ్లు పరిగెట్టిన వైపే నెమ్మదిగా సింహం నడుచుకుంటూ వెళ్ళింది. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతున్నారు. అలాగే రకరకాలుగా కామెంట్లు చేసుకున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్ వేసేయండి.