మ‌ట‌న్ ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

మనం ఆహారంలో భాగంగా రెడ్ మీట్ ( మేక‌, గొర్రె, బీప్, పోర్క్ ) వంటి వాటిని తీసుకుంటూ ఉంటాము. రెడ్ మీట్ లో ప్రోటీన్ ఎక్కువ‌గా ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. అయితే ఈ రెడ్ మీట్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా వెల్ల‌డించారు. కొంద‌రు వారానికి రెండు నుండి మూడు సార్లు రెడ్ మీట్ ను తీసుకుంటూ ఉంటారు. ఇలా రెడ్ మీట్ ను తీసుకోవ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు వారి తాజా ప‌రిశోధ‌న‌ల ద్వారా వెల్ల‌డించారు.

2,16, 695 మందిపై జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది. ప్రాసెస్ చేసిన మ‌రియు ప్రాసెస్ చేయ‌ని రెడ్ మీట్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ వ‌చ్చే ముప్పు మరింత ఎక్కువ‌గాఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. రెడ్ మీట్ ను త‌క్కువ‌గా తీసుకునే వారితో ఎక్కువ‌గా తీసుకునే వారితో పోల్చిన‌ప్పుడు 62 శాతం మ‌ధుమేహం వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. అదే ప్రాసెస్ చేసిన రెడ్ మీట్ ను తీసుకోవ‌డం వల్ల ఈ ముప్పు 46 శాతం ఎక్కువ‌గాఉంటుంద‌ని అదే ప్రాసెస్ చేయ‌ని రెడ్ మీట్ ను తీసుకోవ‌డం వల్ల ఈ ముప్పు 24 శాతం ఎక్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

if you are taking mutton regularly then know these facts

క‌నుక రెడ్ మీట్ ను తీసుకోవ‌డం త‌గ్గించాల‌ని నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్ అవ‌స‌ర‌మ‌య్యే వారు రెడ్ మీట్ కు బ‌దులుగా న‌ట్స్, పాలు, పాల ఉత్ప‌త్తులు, చిక్కుళ్లు, రాజ్మా, చియా విత్తనాలు, క్వినోవా, బాదంపప్పు, గుమ్మ‌డి విత్త‌నాలు, ప‌ప్పు దినుసులు వంటి వాటిని తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా మొక్క ఆధారిత ప్రోటీన్ ఫుడ్స్ ను తీసుకోవ‌డం వల్ల టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశం త‌గ్గ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts