హెల్త్ టిప్స్

రాత్రి పూట ఎంత ప్ర‌య‌త్నించినా నిద్ర ప‌ట్ట‌డం లేదా..? ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్యంగా ఉండడానికి శారీరక శ్రమ ఎంత అవసరమో సరైన విశ్రాంతి కూడా అంతే అవసరం&period; ఐతే చాలా మందికి రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టదు&period; ఎంత నిద్రపోదామని ప్రయత్నించినా నిద్రాదేవి కళ్ళమీదకి రాక అలా చూస్తూనే ఉంటారు&period; ఐతే నిద్ర సరిగ్గా రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి&period; ప్రస్తుతం మనిషికి శారీరక శ్రమ చాలా వరకు తగ్గిపోయింది&period; చుట్టూ మెషీన్లు&comma; ఏది కావాలన్నా కాలు కదపకుండానే అన్నీ దగ్గరికే వచ్చేస్తున్నాయి&period; సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో శారీరక శ్రమ తక్కువగా మానసిక శ్రమ ఎక్కువగా ఉంటుంది&period; ఐతే సరైన నిద్ర రావాలంటే మనసు అలసిపోతే రాదు శరీరం అలసిపోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరం అలసట చెందకుండా ఎంతగింజుకున్నా నిద్ర రాదు&period; మానసిక ఒత్తిడి ఎక్కువగా అనుభవించే వాళ్ళు తమ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటే నిద్ర రాకపోవడం అనే సమస్య ఉండదు&period; అందుకోసం వ్యాయామం చేయడంతో పాటు&comma; మీకిష్టమైన ఆటలు&lpar; ఫిజికల్ గా శ్రమ కలిగించేవి&rpar; ఆడటం బెటర్&period; అయినా సరే నిద్ర సరిగ్గా పట్టట్లేదంటే మానసికంగా మీరేదో ఆలోచిస్తూ ఉన్నారన్న మాట&period; మీకు తెలియకుండానే దేనిగురించో బాధపడుతూ ఉంటున్నారన్న మాట&period; అదేంటో తొందరగా కనిపెట్టండి&period; బాధ ఏదైనా పడుకునే ముందు దాన్ని మెదడులోంచి తీసేసి అటకమీద పడేయండి&period; ఈ రోజు మీరు సరిగ్గా నిద్రపోకపోతే రేపు ఉదయం సరిగ్గా తెల్లవారదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72885 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;sleep-5&period;jpg" alt&equals;"if you are unable to sleep at night try this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదయం చికాగ్గా మొదలైతే ఆ రోజంతా అలానే ఉన్నట్టు అనిపిస్తుంది&period; అందుకే ఉదయం హుషారుగా లేవాలంటే రాత్రి హుషారుగా నిద్రపోవాలి&period; మనసులో ఉన్నవన్నీ పక్కనపెట్టినపుడే ఆ హుషారు కనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్ర రాకపోవడానికి మరో ముఖ్య సమస్య మనం తీసుకునే ఆహారం&period; కాఫీ&comma; టీ ల వల్ల నిద్ర చెడిపోతుంది&period; అందుకే సరిగ్గా నిద్రపోదామనుకునే వాళ్ళు వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది&period; అలాగే పడుకునే ముందు ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవద్దు&period; లైట్ గా ఉండే ఆహార పదార్థాలని తీసుకోవడం ఉత్తమం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts