Cabbage : మనకు చాలా చవక ధరలకు అందుబాటులో ఉండే కూరగాయల్లో క్యాబేజీ ఒకటి. క్యాబేజీలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్, ఫోలేట్, కాల్షియం, పొటాషియం, విటమిన్లు ఎ, సి, కె లు అధికంగా ఉంటాయి. క్యాబేజీల్లొ ఫైటో న్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. దీంతో క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం క్యాబేజీని తినకూడదు. తింటే సమస్యలు మరింత ఎక్కువవుతాయి. మరి ఏయే అనారోగ్య సమస్యలు ఉన్నవారు క్యాబేజీని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. క్యాబేజీలో అధిక భాగం రిఫినోస్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది సరిగ్గా జీర్ణం కాదు. అందువల్ల గ్యాస్, అజీర్ణం సమస్యలు ఉన్నవారు క్యాబేజీని తింటే సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక జీర్ణ సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితిలోనూ క్యాబేజీని తినరాదు.
2. క్యాన్సర్‌కు చికిత్స తీసుకునేవారు క్యాబేజీని తినరాదు. తింటే విరేచనాలు అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక ఈ విషయాన్ని డాక్టర్‌తో నిర్దారించుకోవాలి. క్యాన్సర్ చికిత్స తీసుకునేవారు క్యాబేజీని తినకూడదు.
3. విరేచనాల సమస్య ఉన్నవారు కూడా క్యాబేజీని తినరాదు. తింటే సమస్య మరింత ఎక్కువవుతుంది.
4. రక్తాన్ని పలుచన చేసే మందులను వాడేవారు క్యాబేజీని తినరాదు. క్యాబేజీలో అధిక మొత్తంలో విటమిన్ కె ఉంటుంది. ఇది గాయాలు అయినప్పుడు రక్తం గడ్డ కట్టేందుకు ఉపయోగపడుతుంది. కనుక రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడేవారు క్యాబేజీని ఎట్టి పరిస్థితిలోనూ తీసుకోరాదు.
5. హైపో థైరాయిడిజం వ్యాధితో బాధపడుతున్నవారు కూడా క్యాబేజీని తినరాదు. తింటే థైరాయిడ్ గ్రంథి పనితీరు, థైరాయిడ్ మందులపై ప్రభావం పడుతుంది. కనుక వారు క్యాబేజీని మానేయాలి.