హెల్త్ టిప్స్

బ్రాయిల‌ర్ చికెన్ బాగా తింటున్నారా..? ఇది తెలిస్తే ఆ ప‌ని చేయ‌రు…!

వారాంతాలు, సాధార‌ణ రోజులు అన్న సంబంధం లేకుండా.. చికెన్ ఎడా పెడా లాగించేస్తున్నారా ? అయితే జాగ్ర‌త్త‌. ఎందుకంటే.. ఇప్పుడు మేం చెప్ప‌బోయే విష‌యం తెలిస్తే మీరు ఇక‌పై చికెన్ తినేందుకు భ‌య‌ప‌డ‌తారు. అవును, విష‌యం అలాంటిది మ‌రి. ఇంత‌కీ అస‌లు సంగ‌తేంటంటే.. మ‌నం చాలా వ‌ర‌కు బ్రాయిల‌ర్ చికెన్ తింటున్నాం క‌దా. ఆ కోళ్ల‌ను ఫాంల‌లో బాగా దాణా పెట్టి పెంచుతారు. అందుకే ఆ కోళ్లు బాగా బ‌రువు పెరుగుతాయి. అయితే దాణాతోపాటు కోళ్ల పెంప‌కం దారులు కోళ్ల‌కు యాంటీ బ‌యోటిక్ ఇంజెక్ష‌న్లను కూడా ఇస్తారు. దాని వ‌ల్ల కోళ్లు రోగాల‌కు త‌ట్టుకుని మ‌రింత పెరుగుతాయి. అయితే ఇలా యాంటీ బ‌యోటిక్స్ ఇచ్చి పెంచ‌బ‌డిన కోళ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనారోగ్య స‌మస్య‌లు వ‌స్తాయ‌ని తేలింది.

ది హిందూ, ది బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం అనే సంస్థ‌లు ఇటీవ‌లే ఓ ప‌రిశోధ‌న చేశాయి. అదేమిటంటే… యాంటీ బ‌యోటిక్ ఇంజెక్ష‌న్లు వేసి పెంచ‌బ‌డిన కోళ్లను తిన‌డం వ‌ల్ల మ‌న‌లో ఇన్ఫెక్ష‌న్లు వ‌స్తున్నాయ‌ట‌. అలాగే ఆ ఇన్‌ఫెక్ష‌న్ల‌ను త‌ట్టుకునేందుకు యాంటీ బ‌యోటిక్ మందుల‌ను ఇచ్చినా ఫ‌లితం ఉండ‌డం లేద‌ట‌. ఈ క్ర‌మంలో బాక్టీరియా, వైర‌స్‌లు కూడా మనం వాడే యాంటీ బ‌యోటిక్‌, యాంటీ వైర‌ల్ మందుల‌కు త‌ట్టుకుని రోజు రోజుకీ మ‌రింత బ‌ల‌వంత‌మ‌వుతున్నాయ‌ట‌. అలాగే యాంటీ బ‌యోటిక్ మందులను వాడి పెంచ‌బ‌డిన కోళ్లను తిన‌డం వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్లు వ‌చ్చి మ‌న దేశంలో ఏటా 1 ల‌క్ష మంది చిన్నారులు, 7 ల‌క్ష‌ల మంది పెద్ద‌లు చ‌నిపోతున్నార‌ని ప‌రిశోధ‌న‌లో తెలిసింది.

if you know this you will not take broiler chicken

సాధార‌ణంగా మ‌న దేశంలో ఫాంల‌లో పెంచే కోళ్ల‌కు ఇచ్చే యాంటీ బ‌యోటిక్ మందుల‌ను జొయెటిస్ అనే కంపెనీ త‌యారు చేస్తుంది. నిజానికి ఈ కంపెనీ త‌యారు చేసే మందుల‌ను అమెరికా, యూర‌ప్‌ల‌లో ఎప్పుడో నిషేధించారు. ఆ మందులు వాడి పెంచ‌బ‌డిన కోళ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నుషుల్లో ఇన్‌ఫెక్ష‌న్లు వ‌స్తున్నాయ‌ని తెలుసుకున్న ఆయా దేశాలు యాంటీ బ‌యోటిక్ డ్ర‌గ్స్‌ను కోళ్ల‌కు వాడ‌డాన్ని నిషేధించాయి. కానీ మ‌న దేశంలో మాత్రం ఈ మందుల‌ను విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. ఇదిలా కొన‌సాగితే భవిష్య‌త్తులో మ‌రింత ప్ర‌మాదం ఉంటుంద‌ని సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు. క‌నుక ఈ విష‌యంలో ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాబ‌ట్టి మీరు బ్రాయిల‌ర్ చికెన్ తినే ముందు ఒక‌సారి ఆలోచించండి మ‌రి..!

Admin

Recent Posts