Off Beat

ఆ దీవిలో 6 నెల‌లు ప‌నిచేస్తారా..? రూ.26 ల‌క్ష‌లు జీతం ఇస్తారు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

మీరు ప్ర‌కృతి ప్రేమికులా..? ప‌్ర‌కృతిలో ఎక్కువ సేపు గ‌డ‌ప‌డం అంటే మీకు ఇష్ట‌మా..? అడ‌వులు అన్నా, జంతుజాలం అన్నా మ‌క్కువ ఎక్కువ‌గా ఉంటుందా..? అయితే ఈ జాబ్ మీకోస‌మే. అవును, మీకు ఈ క్వాలిఫికేష‌న్ ఉంటే చాలు, అక్క‌డ ప‌నిచేయ‌వ‌చ్చు. 6 నెల‌ల పాటు ఫిక్స్‌డ్ కాంట్రాక్ట్ జాబ్ అది. ఆ జాబ్‌కు గ‌న‌క మీరు ఎంపికైతే ఎంచ‌క్కా 6 నెల‌ల‌కు రూ.26 ల‌క్ష‌ల వేత‌నం పొంద‌వ‌చ్చు. మరోవైపు ప‌చ్చ‌ని ప్ర‌కృతి, అట‌వీ ప్రాంతంలో గ‌డిపిన‌ట్లు కూడా ఉంటుంది. ఇంత‌కీ ఆ దీవి ఎక్క‌డుంది.. వివ‌రాలు ఏంటి అంటే..?

స్కాట్‌లాండ్‌లోని స‌ద‌ర్‌లాండ్ ప‌శ్చిమ కోస్తా తీరంలో హండా అనే ఐల్యాండ్ ఉంది. అక్క‌డ స్కాటిష్ వైల్డ్ లైఫ్ ట్ర‌స్ట్ వారు ఆ దీవిని 6 నెల‌ల‌పాటు చూసుకునే కేర్ టేక‌ర్ కోసం జాబ్ ప్ర‌క‌ట‌న చేశారు. ఆ దీవిని, అందులో ఉండే జంతువులను సంర‌క్షించాల్సి ఉంటుంది. అలాగే అక్క‌డికి వ‌చ్చే సందర్శ‌కుల‌ను కూడా మేనేజ్ చేయాలి. ఆ దీవీకి ఏటా 8వేల మంది సంద‌ర్శ‌కులు వ‌స్తుంటారు. అలాగే వాలంట‌రీ టీమ్‌ల‌ను లీడ్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్‌కు గాను 6 నెల‌ల కాంట్రాక్ట్ వ‌చ్చే మార్చిలో మొద‌లు కానుంది. ఇందుకు 6 నెల‌ల‌కు 30వేల డాల‌ర్ల‌ను వేత‌నంగా చెల్లిస్తారు. అంటే సుమారుగా రూ.26 ల‌క్ష‌లు అన్న‌మాట‌.

if you can work in that island then you will get rs 26 lakhs

ఇక ఈ జాబ్ చేసేందుకు ఎలాంటి డిగ్రీ అవ‌స‌రం లేదు. ప‌చ్చ‌ని ప్ర‌కృతి, ప‌ర్యావ‌ర‌ణం, అడ‌వులు అంటే ఇష్టం ఉన్న‌వారు, వాటి గురించి బాగా అవ‌గాహ‌న ఉన్న‌వారు ఈ జాబ్‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. మ‌రి మీరు కూడా ఈ జాబ్‌కు అర్హులు అయితే మీకు ఆస‌క్తి ఉంటే వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసేయండి.

Admin

Recent Posts