హెల్త్ టిప్స్

ఈ ఆహార ప‌దార్థాల‌ను తింటే ఇక అంతే… శృంగార సామ‌ర్థ్యం త‌గ్గిపోతుంది..!

మ‌న‌కు అందుబాటులో ఉన్న ఆహార ప‌దార్థాల్లో కొన్ని శృంగార శ‌క్తికి ఏ విధంగా దోహ‌దం చేస్తాయో అంద‌రికీ తెలిసిందే. నిర్దిష్ట‌మైన ఆహారం తిన‌డం వ‌ల్ల స్త్రీ, పురుషులిద్ద‌రిలోనూ శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. దీంతో వారు ఆ కార్యంలో చాలా చురుగ్గా పాల్గొంటారు కూడా. అయితే కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు మాత్రం శృంగార సామ‌ర్థ్యాన్ని ఏ మాత్రం పెంచ‌వు సరి క‌దా, ఉన్న సామ‌ర్థ్యాన్ని త‌గ్గించే ప‌ని చేస్తాయి. అప్పుడు జంటలో ఏ ఒక్క‌రికీ కూడా దానిపై ఆస‌క్తి క‌ల‌గ‌దు. ఈ క్ర‌మంలో అలా శృంగార కాంక్ష‌ను, సామ‌ర్థ్యాన్ని త‌గ్గించే ఆహార ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మైక్రోవేవ్ పాప్‌కార్న్‌… పాప్ కార్న్ స‌హ‌జంగా మంచి ఆహార ప‌దార్థ‌మే. అందులో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. చాలా మేలు చేస్తుంది. కానీ దాన్ని సహ‌జ సిద్ధంగా చేస్తేనే ఆ ఫలితం ఉంటుంది. అలా కాకుండా మైక్రోవేవ్ ఓవెన్ ద్వారా త‌యారు చేసిన పాప్ కార్న్ తింటే మాత్రం అది చేటు తెస్తుంది. శృంగార వాంఛ‌ను, సామ‌ర్థ్యాన్ని త‌గ్గిస్తుంది. ప్ర‌ధానంగా పురుషుల‌పై దీని ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది.

చీజ్‌… కృత్రిమంగా త‌యారు చేసిన చీజ్‌ను తింటే ఇక అంతే సంగ‌తులు. ఎందుకంటే అందులో సింథ‌టిక్ హార్మోన్లు ఉంటాయి. అవి శృంగార సామ‌ర్థ్యాన్ని దెబ్బ తీస్తాయి. దాన్ని తింటే స్త్రీల‌లోనూ రుతుక్ర‌మ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక చీజ్ మానేయడం ఉత్త‌మం. కొవ్వు ప‌దార్థాలు… కొవ్వు ఎక్కువ‌గా ఉన్న ఆహార ప‌దార్థాల‌ను తిన్నా అది శృంగార జీవితంపై ప్ర‌భావం చూపుతుంది. ఎందుకంటే అలాంటి వారిలో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోయి అది ర‌క్త నాళాల‌కు అడ్డు ప‌డుతుంద‌ట‌. దాని వ‌ల్ల వారిలో ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌ర‌గ‌ద‌ట‌. దీంతో శృంగార వాంఛ త‌క్కువ‌గా ఉండ‌డ‌మే కాదు, ఆ సామ‌ర్థ్యం కూడా త‌గ్గిపోతుంద‌ట‌.

if you take these foods your sexual desire will reduce

కూల్ డ్రింక్స్‌… కూల్ డ్రింక్స్ ఎక్కువ‌గా తాగే అల‌వాటు ఉన్న వారిలో కూడా శృంగార సామ‌ర్థ్యం త‌గ్గిపోతుంద‌ట. వారు ఆ ప‌నిలో యాక్టివ్‌గా ఉండ‌లేర‌ట‌. మ‌ద్యం… మ‌ద్యం ఎక్కువగా సేవించే వారిలో శృంగార సామ‌ర్థ్యం గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంది. వారిలో శృంగారం ప‌ట్ల ఆస‌క్తి అస‌లే క‌ల‌గ‌ద‌ట‌. సోడియం… సోడియం ఎక్కువ‌గా ఉండే ఉప్పు ఇత‌ర సాల్టెడ్ ఆహార ప‌దార్థాల‌ను తింటే దాంతో ఒంట్లో బీపీ బాగా పెరుగుతుంది. అలాంటి వారు శృంగారంలో ఎంజాయ్ చేయ‌లేరు స‌రిక‌దా, ఆ వాంఛ, సామ‌ర్థ్యం కూడా త‌గ్గిపోతాయి.

Admin

Recent Posts