వినోదం

కమల్ హాసన్, సారికల విడాకులకు అసలు కారణం ఏంటో తెలుసా?

టాలీవుడ్ లో ప్రస్తుతం కొంతమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది సీనియర్ హీరోలు కూడా తను భార్యలకు విడాకులు ఇచ్చారు. అలాంటి వారిలో విశ్వ నటుడు కమల్ హాసన్ కూడా ఒకరు. కమల్ హాసన్ మొదటసారిగా సారిక‌ ను వివాహం చేసుకున్నారు. వారికి శృతిహాసన్, అక్షర హాసన్ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కమల్, సారికలు 1988లో వివాహం చేసుకున్నారు.

పెళ్లి తర్వాత సారిక నటనకు గుడ్ బై చెప్పింది. తర్వాత కమల్ చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. 15 ఏళ్ల పాటు సాఫీగా సాగిన వీరి వివాహ బంధానికి ముగింపు పడింది. 2004లో ఈ జంట విడిపోయింది. అభిప్రాయాలు కలవకపోవడం వల్ల వీరిద్దరు విడిపోయారని స్వయంగా శృతిహాసన్ తెలిపింది.ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కమల్ హాసన్ సారికకు విడాకులు ఇచ్చి నటి గౌతమిని పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి వైవాహిక జీవితం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. దాంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

why kamal haasan given divorce to sarika

అయితే అప్పట్లో గౌతమి, కమల్ హాసన్ విడాకులకు ఓ హీరోయిన్ కారణమని, ఆ హీరోయిన్ తో రిలేషన్ షిప్ వల్లనే గౌతమి కమల్ హాసన్ విడిపోయారని వార్తలు వచ్చాయి.కాగా ఓ ఇంటర్వ్యూలో గౌతమి తమ విడాకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ తో విడాకులకు హీరోయిన్ కారణమని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఎవరు మధ్యలో వచ్చినా మనుషులు మార‌రని అందుకే విడిపోవాల్సి వచ్చిందని గౌతమి పేర్కొన్నారు. తమ దారులు వేరయ్యాయని ఇద్దరం డైవర్ట్ అయ్యామని తెలిపారు. విడాకుల వల్ల తాను ఎంతో బాధపడ్డాను అని చెప్పారు.

Admin

Recent Posts