హెల్త్ టిప్స్

మీ భుజాలు ఎల్ల‌ప్పుడూ స‌రైన ఆకృతిలో ఉండాలంటే ఇలా చేయండి..!

చేతులు ముందు పెట్టుకొని దీర్ఘకాలం కూర్చునే వారికి గూని భుజాలు ఏర్పడే ప్రమాదముంది. అనేక గంటలు ఎక్కువ సేపు ఒకే పొజిషన్ లో కూర్చునే వారికి గుండ్రటి భుజాలు ఏర్పడతాయి. ఎప్పటికపుడు పొజిషన్లు మారుస్తూ మధ్య మధ్యా నడక సాగిస్తుంటే వెన్ను నొప్పి, గూని వీపు మొదలైన సమస్యలు ఏర్పడకుండా వుంటాయి. గూని భుజాలను సరి చేసుకోడానికి కొన్ని వ్యాయామాలు ఇవ్వబడ్డాయి. ఛాతీ, వీపుల ధృఢత్వాన్ని ఎప్పటికపుడు పెంచుకోవడం ప్రధానం. గూనిగల వీపు లేదా భుజాలు ఛాతీ కండరాలపై ప్రభావాన్ని చూపుతాయి. గూని భుజాలను సరిచేసుకోవాలంటే తిన్నగా నిలబడి వెనుక నుండి భుజాలను తిప్పండి. అయిదు సెకండ్లు వెనక్కు ఉంచండి. ఈ విధంగా 10 సార్లు రిపీట్ చేయండి.

గోడకు వీపుతో ఆనుకుని తిన్నగా నిలబడటం సాధన చేయండి. మీ తల, భుజాలు, పిరుదులు, మోకాలి కింది వెనుక భాగం మీ చేతి వెనుకలు అన్ని గోడకు టచ్ అవతూ వుండాలి. మీ శరీరాన్ని చేతులను గోడవైపుకు నెట్టండి. కాళ్ళపై బరువు తగ్గటాన్ని గమనించండి. ముందుకు వంగవద్దు. అయిదునుండి ఆరు గాఢ శ్వాసలు పీల్చండి. కొద్ది సేపు విశ్రాంతి. అక్కడే కొద్దిసేపూ అటూ ఇటూ తిరగండి. మరో మూడు సార్లు రిపీట్ చేయండి. ఈ రకంగా వ్యాయామం చేస్తే భుజాలు సరిచేయబడి మీ శరీర రూం చక్కబడుతుంది.

if you want your shoulders in good shape follow this

గూని భుజాలను సరిచేయటానికి మరో వ్యాయామంగా, నేలపై వీపు ఆనించి పరుండండి. చేతులను పైకి ఎత్తండి. ఇపు డు మెల్లగా చేతులు నేలపైకి దించండి అరచేతులు కిందివైపు చూడాలి. చేతులు తిన్నగా నేలకు సమాంతరంగా వుంచండి. మోచేతులను మెడపైకి వంచి కనీసం అయిదు నుండి పది సెకండ్లు వుండండి. గూని భుజాలను సరిచేయటానికి అరచేతులను భుజాలపై పెట్టి చేతులు వెనక్కు వంచండి. ఈరకమైన వ్యాయామం భుజాల నొప్పులను పోగొడుతుంది. ఈ చిన్న వ్యాయామాలు చేసి గూని లేదా గుండ్రటి భుజాలను సరి చేసుకోండి. గుండ్రటి భుజాలు రాకూడదనుకుంటే తిన్నగా కూర్చోవాలి.

Admin

Recent Posts