హెల్త్ టిప్స్

మీరు తినే ఆహారం రుచి పెర‌గాలంటే ఇలా చేయండి..!

పోషకాహార విలువలు కల ఆహార పదార్ధాలు సాధారణంగా రుచిగా వుండవు. తక్కువ కొవ్వు కల పదార్ధాలు పోషకాహారం కలవైనప్పటికి మనం వాటిని తినకుండా ఏదో కారణాలు చెప్పి తప్పించేస్తుంటాం. కనుక పోషకాహార విలువలు కల పదార్ధాలను మరింత రుచికరంగా ఏ రకంగా చేసుకొని లబ్ది పొందవచ్చో చూద్దాం. తినే పదార్ధాలకు మంచి రుచి రావడానికి కొన్ని మంచి మసాలా దినుసులు వాడండి. చాలామంది డైట్ ఆహారమంటే చప్పగా వుంటుందంటారు. కనుక కొద్దిపాటి మసాలా తగిలిస్తే అదే బాగుంటుంది. మసాలా దినుసులు కేలరీలు జత చేయవు.

అయితే శరీరానికి హానికరం కాని మసాలా దినుసులు వాడాలి. మిరియాలు నూరి వేసినా లేదా అలాగా వేసినా వంటకాల్లో మంచి రుచినిస్తాయి. మీరు తాగే సూపులు, సలాడ్లకు మిరియం వేసి వ్యత్యాసం చూడండి. అదే విధంగా ధనియాలు, జీలకర్ర మెంతులు వంటివి కూడా కొన్ని పదార్ధాలకు కలిపి నోటికి రుచిగా అందించవచ్చు. సాధారణంగా ఆరోగ్యం కొరకు తినే వాటిలో మొలకెత్తిన విత్తనాలు ప్రధానమైనవి. వీటికి రుచి కల్పించటానికి గాను పచ్చమిరపకాయ ముక్కలు చిన్నవి గా తరిగి లేదా ఉల్లిపాయ ముక్కలు కలిపి తింటే చాలా తేలికగాను, రుచికరంగాను తినవచ్చు. లేదా మొలకలకు తగినంత నిమ్మరసం కలిపి తినవచ్చు.

follow these tips to increase food taste

నిమ్మ రసాన్నితగుమాత్రంగా ఏ రకమైన డిష్ కు కలిపినప్పటికి నోరూరించే రుచి తప్పక ఏర్పడగలదు. సువాసనలు వెదజల్లే కొత్తిమీర లేదా వెల్లుల్లి వంటివి కూడా కొన్ని తిండి పదార్ధాలలో వేసి మంచి రుచిని వాసనను కల్పించవచ్చు. కరివేపాకు కూడా కొన్ని పదార్ధాలలో కలిపి ఆరోగ్యకరమైనది మంచి వాసన కలదిగాను తయారు చేయవచ్చు. అదే విధంగా తక్కువ కొవ్వు కల కోడిగుడ్డు సొన అనేక తిండి పదార్ధాలలో కలిపి రుచికరం చేయవచ్చు. తక్కువ కొవ్వు కల వెన్న లేదా పాలు తినే పదార్ధాలకు కలిపి రుచి తీసుకు రావచ్చు. ఈ కొద్దిపాటి మార్పులు పెద్ద తేడా చేస్తాయి. చిట్కాలు తెలిశాయి కనుక మంచి పోషకాహార విలువలు కల తిండిపదార్ధాలకు చక్కటి రంగు, రుచి, వాసనలు వచ్చే విధంగా హాని లేని విధంగా తయారు చేసుకోని ఇక తినడం మొదలుపెట్టండి.

Admin

Recent Posts