Iodine Foods For Thyroid : మన శరీరంలో ఉండే అతి ముఖ్యమైన గ్రంథులల్లో థైరాయిడ్ గ్రంథి కూడా ఒకటి. ఈ గ్రంథి గొంతు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. శరీరంలో జీవక్రియలను నియంత్రించడంలో, హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో, శరీరం యొక్క పెరుగుదల మరియు శక్తి స్థాయిలను అదుపులో ఉంచడంలో ఈ గ్రంథి మనకు సహాయపడుతుంది. థైరాయిడ్ గ్రంథి మన శరీరంలో అతి ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. కనుక ఈ గ్రంథి పనితీరు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా ఉండాలంటే మనం అయోడిన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇప్పుడు చెప్పే ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత అయోడిన్ అందుతుంది. వీటిని తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి లోపాలు రాకుండా ఉంటాయి. అలాగే థైరాయిడ్ గ్రంథి లోపాలతో బాధపడే వారికి చక్కటి ఫలితం కలుగుతుంది. మనం రోజువారి ఆహారంలో భాగంగా నోరి, కెల్ప్, వాకమే వంటి వాటిని తీసుకోవాలి. వీటిలో అయోడిన్ ఎక్కువగా ఉంటుంది.
సూప్, సలాడ్స్, సుషీ వంటి వాటిలో వీటిని తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. అలాగే కాడ్, ట్యూనా, సాల్మన్ వంటి చేపలను తీసుకోవాలి. వీటిలో అయోడిన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. అదే విధంగా పాలు, పాల ఉత్పత్తులల్లో కూడా అయోడిన్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ గ్రంథి పినతీరు మెరుగుపడుతుంది. ఇక అయోడిన్ కలిగిన ఆహారాల్లో గుడ్లు కూడా ఒకటి. అయోడిన్ తో పాటు గుడ్లలల్లో ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యానికి ఇవి ఎంతో సహాయపడతాయి. అలాగే అయోడైజ్డ్ ఉప్పును తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి తగినంత అయోడిన్ అందుతుంది. అయితే శరీర ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉప్పును మితంగా తీసుకోవడం చాలా అవసరం. ఇక థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడంలో బెర్రీలు మనకు ఎంతో సహాయపడతాయి.
స్ట్రాబెర్రీ, క్రాన్బెర్రీస్ వంటి వాటిని తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి. సలాడ్, స్మూతీ వంటి వాటితో వీటిని కూడా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక బీన్స్, కాయ ధాన్యాలు, చిక్కుళ్ళు వంటి వాటిలో కూడా అయోడిన్ ఉంటుంది. అలాగే మన శరీరానికి అవసరమయ్యే ఇరత పోషకాలు కూడా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడడంతో పాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే బాదం, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు వంటి వాటిని తీసుకోవడం వల్ల అయోడిన్ తో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. ఈ విధంగా ఈ ఆహారాలను రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి లోపాలు తగ్గడంతో పాటు థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.