హెల్త్ టిప్స్

గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా?

గ్రీన్ టీ తాగండి.. ఆరోగ్యానికి మంచిది అని కొందరంటారు. మరి కొందరేమో.. గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిది కాదు అంటారు. మరొకరు ఇంకోటి అంటారు. ఇంకొకరు మరొకటి అంటారు. ఇలా… పలు రకాలుగా చెబుతుంటారు. డాక్టర్లు మరోటి చెబుతారు. అసలు గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా?

నిజానికి.. పలు ఆరోగ్య సమస్యలను నివారించడానికి గ్రీన్ టీ తాగుతారు. కానీ.. గ్రీన్ వల్ల అంతగా ఆరోగ్య ప్రయోజనాలు ఉండకపోవచ్చని చెబుతున్నరు పరిశోధకులు. చాలామంది గ్రీన్ టీ తాగితే బరువు తగ్గుతారు… కేన్సర్ ను నివారించవచ్చు అంటూ చెబుతుంటారు కానీ.. అది ఇప్పటి వరకు రుజువు కాలేదని పరిశోధకులు చెబుతున్నారు.

is green tea good or bad for health

అంతే కాదు.. గ్రీన్ టీ వల్ల ఎన్నో రకాల ఫలితాలు ఉంటాయని ఎక్కువగా తీసుకుంటే… అనారోగ్యం తప్పించి ఇంకేమీ ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ వల్ల తలనొప్పి, వాంతులు, నిద్రలేమి, డయేరియా లాంటి సమస్యలు తలెత్తుతాయట. అంతే కాదు.. హైబీపీ, లోబీపీ ఉన్నవాళ్లు గ్రీన్ టీ ని ఎక్కువగా తీసుకోవద్దట. ఒకవేళ గ్రీన్ టీని తమ జీవితంలో భాగం చేసుకోవాలనుకునేవాళ్లు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ల సలహా మేరకు గ్రీన్ టీని వాడాలని నిపుణులు చెబుతున్నారు.

Admin

Recent Posts